News April 2, 2025
2 ఉద్యోగాలు సాధించిన వాంకిడి వాసి శివప్రసాద్

వాంకిడి మండలానికి చెందిన బెల్లాల రమేశ్, తార దంపతుల తనయుడు శివ ప్రసాద్ రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తాచాటారు. గత సంవత్సరం ఏపీజీబీలో జాబ్ చేస్తూ నిన్న వెలువడిన ఐబీపీఎస్ ఫలితాల్లో ఇండియన్ బ్యాంక్ క్లర్క్గా ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు,గురువుల ప్రోత్సాహంతో ఇది సాధ్యమైందని శివప్రసాద్ తెలిపారు.
Similar News
News November 21, 2025
OFFICIAL: రెండో టెస్టుకు కెప్టెన్గా పంత్

గువాహటి వేదికగా రేపటి నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్టుకు కెప్టెన్ గిల్ దూరమైనట్లు BCCI ప్రకటించింది. దీంతో జట్టుకు పంత్ నాయకత్వం వహించనున్నట్లు వెల్లడించింది. మెడకు గాయం కారణంగా తొలి టెస్టులోనూ గిల్ బ్యాటింగ్ చేయలేకపోయిన విషయం తెలిసిందే. చికిత్స తర్వాత గువాహటికి వెళ్లినప్పటికీ క్రికెట్ ఆడేందుకు అతను ఫిట్గా లేడని BCCI తెలిపింది. మరిన్ని టెస్టులు, చికిత్స కోసం ముంబై వెళ్తున్నట్లు పేర్కొంది.
News November 21, 2025
సంగారెడ్డి: షూటింగ్ విజేతలకు కలెక్టర్ అభినందనలు

భద్రాద్రి జిల్లాలో జరిగిన ఎస్జీఎఫ్(SGF) క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహించిన షూటింగ్ పోటీలో సంగారెడ్డి టీం సభ్యులు పాల్గొన్నారు. ప్రతిభ చాటిన వారిని కలెక్టర్ జితేష్ పాటిల్ అభినందించి, ధ్రువపత్రాలు అందజేశారు. జాతీయ స్థాయిలో జిల్లా టీం ప్రాతినిధ్యం వహించేలా కృషి చేస్తామని షూటింగ్ జిల్లా కార్యదర్శి శేశ్వంత్ తెలిపారు.
News November 21, 2025
నవాబుపేట: కూతురి ప్రేమ వ్యవహారంతో తండ్రి ఆత్మహత్య

నవాబుపేట మండలం హన్మసానిపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కౌల్ల ఎల్లయ్య(40) కూతురు గౌతమి ఓ యువకుడిని ప్రేమించి అతనితో వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో మనస్తాపం చెంది బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. గురువారం ఉదయం తన పొలంలోని చింతచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అరుణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


