News March 24, 2024
2 నుంచి ముత్యాలమ్మ జాతర

చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో ఏప్రిల్ 2 నుంచి శ్రీ ముత్యాలమ్మ జాతర జరగనుంది. మొదటి రోజు శ్రీపోలేరమ్మ నిలుపు అనంతరం ఉదయం 5 గంటలకు అమ్మవారికి దిష్టి తీసిన తర్వాత బంగారు చీరతో అలంకరిస్తారు. ఆ రోజు రాత్రి సింహవాహన సేవ జరుగుతుంది. 3న యార, గొల్లల ఉత్సవం 4న గురునాథ స్వామి గ్రామోత్సవం నిర్వహిస్తారు. 5 పోలేరమ్మను సాగనంపుతారు. లక్షల మంది భక్తుల రాక నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News October 25, 2025
కృష్ణపట్నం పోర్టులో ఒకటవ ప్రమాదవ హెచ్చరిక

బంగాళాఖాతంలో ఉన్న తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తుపాను ఏర్పడే అవకాశం ఉండడంతో ఒకటవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్ట్‌లో ఒకటవ ప్రమాదవ హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
News October 25, 2025
రిజిస్ట్రేషన్స్ కోసం వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలి : జిల్లా రిజిస్ట్రార్

ప్రభుత్వం ఎవ్వరినీ దస్తావేజు లేఖరులుగా నియమించలేదని, లైసెన్స్ ఇవ్వలేదని ప్రజలు తమకు తామే IGRS (www.registration.ap.gov.in) వెబ్ సైట్లో ఉన్న నమూనాలను ఉపయోగించుకుని దస్తావేజులు తయారు చేసుకోవచ్చని జిల్లా రిజిస్ట్రారు బాలాంజనేయులు తెలిపారు. చలానాలు చెల్లించి ప్రజలకు కావలసిన సమయంలో స్లాట్ బుక్ చేసుకొని నేరుగా సబ్-రిజిస్ట్రార్లని సంప్రదించి తమ దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.
News October 25, 2025
కర్నూలు ప్రమాద బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం: MP

కర్నూలు బస్సు ప్రమాదంలో మృతి చెందిన గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేష్ కుటుంబ సభ్యులను MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. తన తరపున రూ.5 లక్షలను కుటుంబానికి అందజేస్తానని ప్రకటించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అదేవిధంగా గుడ్లూరు(M) దారకానిపాడు హత్యోదాంత బాధితులను MLA ఇంటూరి నాగేశ్వరావుతో కలిసి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు ఆర్ధిక సాయం అందజేశారు.


