News September 22, 2024
2 రోజులు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రద్దు

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా గుంటూరు(GNT)- విశాఖపట్నం(VSKP) మధ్య ప్రయాణించే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను 2 రోజులపాటు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు నం.17239 GNT-VSKP మధ్య ప్రయాణించే రైలును ఈ నెల 29,30వ తేదీల్లో, నం.12740 VSKP-GNT రైలును ఈ నెల 30, అక్టోబర్ 1వ తేదీన రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
Similar News
News November 30, 2025
డిసెంబర్ 4,5,6 తేదీల్లో కృష్ణా తరంగ్-2025

కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో డిసెంబర్ 4,5,6 తేదీల్లో కృష్ణా తరంగ్-2025 వేడుకలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రికలను విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాంజీ ఆవిష్కరించారు. రుద్రవరంలోని విశ్వవిద్యాలయంలో 3 రోజుల పాటు వివిధ రకాల అంశాల్లో కల్చరల్ ఈవెంట్స్‌ను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కృష్ణా తరంగ్-2025 కన్వీనర్ ఆచార్య దిలీప్, తదితరులు పాల్గొన్నారు.
News November 30, 2025
కృష్ణా: యువకుడి ప్రాణం తీసిన కుక్క

కంకిపాడు మండలం ఈడుపుగల్లు హైవేపై రామాలయం వద్ద శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో వణుకూరుకు చెందిన కుమారవర్ధన్ (28) మృతిచెందాడు. కుమారవర్ధన్ బుల్లెట్‌పై వస్తుండగా, కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి పడిపోయింది. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 29, 2025
కృష్ణా: కంటైనర్లతో ధాన్యం రవాణా.!

జిల్లాలో ధాన్యం సేకరణ కొనసాగుతున్నప్పటికీ రవాణా వాహనాల లభ్యత లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ధాన్యాన్ని లారీలు, ట్రక్కుల ద్వారా స్టాక్ పాయింట్లకు తరలించే విధానాన్ని అనుసరించేవారు. అయితే ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్ వాహనాలు అందుబాటులో లేకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యామ్నాయంగా కంటైనర్లలో రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యాన్ని లోడింగ్ చేసి స్టాక్ పాయింట్లకు తరలిస్తున్నారు.


