News September 22, 2024
2 రోజులు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రద్దు
నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా గుంటూరు(GNT)- విశాఖపట్నం(VSKP) మధ్య ప్రయాణించే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను 2 రోజులపాటు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు నం.17239 GNT-VSKP మధ్య ప్రయాణించే రైలును ఈ నెల 29,30వ తేదీల్లో, నం.12740 VSKP-GNT రైలును ఈ నెల 30, అక్టోబర్ 1వ తేదీన రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
Similar News
News October 5, 2024
నేడు పార్టీ అధిష్ఠానం వద్దకు కొలికపూడి
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై పలువురు చేసిన ఆరోపణలు నియోజకవర్గంలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ మేరకు టీడీపీ అధిష్ఠానం ఆయన్ను వివరణ కోరనుంది. ఇదే సమయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు శావల దేవదత్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొలికపూడిని ఇవాళ మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి రావాలని అధిష్ఠానం ఆదేశించింది.
News October 5, 2024
విజయవాడ: నేడు అన్నపూర్ణా దేవిగా అమ్మవారి దర్శనం
శరన్నవరాత్రులలో భాగంగా దుర్గమ్మ రేపు శనివారం శ్రీ అన్నపూర్ణదేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సృష్టి, స్థితి, లయకు కారణభూతమై, జీవకోటికి ప్రాణాధారమైన ఆహారాన్ని అందించే దేవతగా అన్నపూర్ణదేవిని భక్తులు కొలుస్తారు. ఈ రూపంలో అమ్మవారిని పూజిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, కుశలత, వాక్‌సిద్ధి సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. అన్నపూర్ణమ్మను పూజిస్తే ఆకలిదప్పుల బాధలు ఉండవని తెలిపారు.
News October 5, 2024
APTDC ఛైర్మన్‌గా నేడు బాధ్యతలు స్వీకరించనున్న నూకసాని
ఏపీ టూరిజం డెవలప్మెంట్ ఛైర్మన్‌గా డా.నూకసాని బాలాజీ శనివారం బాధ్యతలు చేపట్టనున్నారు. విజయవాడ ఆటోనగర్‌లోని APTDC కార్యాలయంలో ఉదయం 10.50 గంటలకు APTDC ఛైర్మన్‌గా నూకసాని బాధ్యతలు స్వీకరిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌తోపాటు NDA కూటమి పక్షాల నేతలు పాల్గొంటారని పేర్కొన్నాయి.