News September 7, 2024
2 రోజుల్లోనే పూర్తయిన గేట్ల మరమ్మతులు
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు పూర్తి చేశారు. 67, 69వ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను శనివారం మధ్యాహ్నం నాటికి విజయవంతంగా అమర్చారు. భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా రెండు రోజుల్లోనే ఇంజినీర్లు, సిబ్బంది గేట్ల మరమ్మతు పనులు పూర్తి చేశారు. నదిలో లక్షన్నర క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నా సాహసోపేతంగా పనిచేసి గేట్లు అమర్చారు. నిపుణుడు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో ఈ పనులు చేశారు.
Similar News
News October 7, 2024
నేడు దుర్గమ్మ ఏ అవతారంలో దర్శనమిస్తారంటే?
దసరా శరన్నవరాత్రులలో ఐదో రోజైన సోమవారం విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ మహా చండీదేవిగా దర్శనమివ్వనున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారిని ఎరుపు రంగు చీరతో అలంకరించనున్నారు. అమ్మవారి శక్తివంతమైన రూపాల్లో ఈ రూపం ఒకటని, చెడును నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో వస్తారని పండితులు తెలిపారు. శ్రీ చండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లేనని పురాణాలలో ప్రస్తావించబడిందన్నారు.
News October 7, 2024
మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన MLA సుజనా
రాజు సమర్థుడైతే ఆ రాజ్యం ముందు ప్రపంచమే మోకరిల్లుతుందని ప్రధాని మోదీని ఉద్దేశించి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా ఆదివారం ట్వీట్ చేశారు. ఒకప్పుడు సలహా కోసం ప్రపంచం వైపు చూసే స్థాయి నుంచి నేడు మోదీ నాయకత్వంలో అగ్రరాజ్యాలకు సలహాలు ఇచ్చే స్థాయికి భారత్ చేరుకుందని సుజనా పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకుకు సలహా ఇచ్చే ఉన్నత స్థితిలో దేశం నిలబడటానికి మోదీ నాయకత్వమే కారణమని సుజనా ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
News October 6, 2024
కృష్ణా: డిగ్రీ పరీక్షల టైంటేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (డిస్టెన్స్) పరిధిలో డిగ్రీ(బీ.ఏ.) చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 25 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. 3వ సెమిస్టర్ పరీక్షలు 17 నుంచి 26 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.