News July 1, 2024

2 వారాలకోసారి పిఠాపురంలోనే కలెక్టర్: పవన్ కళ్యాణ్

image

పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. చేబ్రోలులో పింఛన్లు పంపిణీ చేసిన పవన్ మాట్లాడుతూ.. ఇక్కడి సమస్యల పరిష్కారం కోసం ప్రతి 2 వారాలకొకసారి కలెక్టర్ షన్మోహన్ స్వయంగా పిఠాపురం వస్తానని తనతో చెప్పారన్నారు. సమస్యలను ఫిర్యాదుల రూపంలో తేలియజేస్తే పరిష్కారానికి చొరవ తీసుకుంటారని పేర్కొన్నారు. బిజీ షెడ్యూల్‌లోనూ కలెక్టర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని పవన్ అభినందించారు.

Similar News

News December 7, 2025

కొవ్వూరు బీజేపీలో ఆధిపత్య పోరు

image

కొవ్వూరు BJPలో ఆధిపత్య పోరు ఉందని ప్రచారం సాగుతోంది. జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పరిమి రాధాకృష్ణ మధ్య సఖ్యత లోపించిందని క్యాడర్ గుసగుసలాడుతోంది. తాజాగా కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో రెండు హాల్టుల పునరుద్ధరణపై ఇరువురు నేతలు తమ మద్దతుదారులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. క్రమశిక్షణకు మారుపేరైన BJPలో ఇలాంటి పరిస్థితి ఏంటని కార్యకర్తలు వాపోతున్నారు.

News December 7, 2025

నేర నియంత్రణకు కఠిన చర్యలు: ఎస్పీ

image

శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యమని ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. నేర నియంత్రణలో భాగంగా జిల్లాలో 317 మందిపై రౌడీషీట్లు తెరిచినట్లు ప్రకటించారు. 19 మందిపై పీడీ యాక్ట్, పలువురిపై పీఈటీ ఎన్ఏఎస్ నమోదు చేశామని, 432 మందిపై బైండోవర్ కేసులు పెట్టామని వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం అవసరమన్నారు.

News December 7, 2025

తూ.గో: గగనతలంలో ‘తూర్పు’ ఆశలు!

image

నేడు ‘అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం’. ఈ నేపథ్యంలో తూ.గో. వాసుల ఆకాంక్షలు బలంగా వినిపిస్తున్నాయి. మధురపూడి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించాలన్నది ప్రజల చిరకాల స్వప్నం. కడియం పూల గుబాళింపులు విదేశాలకు చేరేలా ‘కార్గో’ సేవలు విస్తరించాలని, గోదావరిపై సీప్లేన్ పర్యాటకం కొత్త పుంతలు తొక్కాలని కోరుతున్నారు. వాణిజ్య, పర్యాటక అభివృద్ధికి విమానయాన రంగం ఊతమివ్వాలని ఆశిస్తున్నారు.