News November 27, 2025
2 జిల్లాల్లో నియోజకవర్గం.. తొలిదశలోనే పోలింగ్..!

రెండు జిల్లాలలో విస్తరించి ఉన్న వేములవాడ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు తొలి విడతలో ఒకేసారి జరగనున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 మండలాల్లో 85, జగిత్యాల జిల్లాలో 3 మండలాల్లో 44 పంచాయతీలు ఉండగా, నేటి నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పరిశీలన, డిసెంబర్ 3న ఉపసంహరణ అనంతరం 11న పోలింగ్ నిర్వహించనున్నారు. రెండు జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లోనూ ఒకే దశలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
Similar News
News November 27, 2025
వేములవాడ ఆలయ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో కేవలం శానిటేషన్ విభాగం సిబ్బందికి మాత్రమే ఈ విధానం అమలులో ఉండగా, కొత్తగా ఆలయ సిబ్బంది అందరికీ బయోమెట్రిక్ యంత్రం ద్వారా హాజరు వేసుకునే పద్ధతిని ప్రారంభించారు. కాగా, ఆలయ ఈవో రమాదేవి బయోమెట్రిక్ హాజరు పనిచేస్తున్న తీరును గురువారం పరిశీలించారు.
News November 27, 2025
సారీ.. అంచనాలు అందుకోలేకపోయాం: పంత్

తాము సరిగ్గా ఆడలేదని ఒప్పుకోవడానికి సిగ్గు పడట్లేదని కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపారు. ‘జట్టుగా, వ్యక్తిగతంగా మేమెప్పుడూ హయ్యెస్ట్ లెవల్లో పర్ఫార్మ్ చేసి కోట్లమంది భారతీయుల ముఖాల్లో చిరునవ్వు తేవాలనుకుంటాం. ఈసారి ఆ అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించండి. దేశానికి ప్రాతినిధ్యం వహించడం మాకు గర్వకారణం. ఈ జట్టు ఏం చేయగలదో మాకు తెలుసు. ఈసారి జట్టుగా, వ్యక్తిగతంగా మంచి కంబ్యాక్ ఇస్తాం’ అని ట్వీట్ చేశారు.
News November 27, 2025
పీ-4 కార్యక్రమానికి పెద్ద మనసుతో ముందుకు రావాలి: మంత్రి

నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో పీ-4 కార్యక్రమం అమలుపై గురువారం సమీక్షించారు. పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు అధికారులు పెద్ద మనసుతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముందుకు వస్తే తొలి నా వంతు సాయంగా రూ.10 లక్షలు అందిస్తానన్నారు.దొంగతనం జరిగిన కొన్ని గంటల్లోనే రికవరీ చేస్తున్న పోలీసులను అభినందించారు.


