News January 31, 2026

2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ షురూ.. CCTVల నిఘాలో పరీక్షలు

image

TG: రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు 1,440 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఉదయం 9-12, మధ్యాహ్నం 2-5 గంటల మధ్య ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. అన్ని సెంటర్లలో CCTV కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు సైన్స్ స్ట్రీమ్ నుంచి 4 లక్షలు, వొకేషనల్ నుంచి లక్ష మంది హాజరవుతారు. ఇప్పటికే వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు.

Similar News

News February 12, 2026

IPLలో అన్‌సోల్డ్.. PSLలో ఖరీదైన ప్లేయర్

image

IPL వేలంలో అన్‌సోల్డ్‌గా మిలిగిన స్టీవ్ స్మిత్‌కు PSLలో రికార్డు స్థాయి ధర లభించింది. లీగ్ హిస్టరీలోనే అత్యధికంగా PKR 14 కోట్ల(₹4.54Cr)కు ఆయనను సియాల్‌కోట్ స్టాలియన్స్ సొంతం చేసుకుంది. బౌలర్ నసీమ్‌ను PKR 8.65 కోట్లకు, అష్రఫ్‌ను PKR 8.5 కోట్లకు ఇస్లామాబాద్ కొనుగోలు చేసింది. పాక్ స్టార్ ప్లేయర్ బాబర్‌కు పెషావర్ టీమ్ PKR 7 కోట్లే వెచ్చించడం గమనార్హం. మార్చి 26 నుంచి మే 3 వరకు 8 జట్లతో PSL జరగనుంది.

News February 12, 2026

అందుకే BRS అధికారం కోల్పోయింది: కవిత

image

TG: ప్రజాస్వామ్య విలువలను కాలరాయడం వల్లే BRS అధికారం కోల్పోయిందని కవిత అన్నారు. ‘ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చనందుకే KCR అధికారం కోల్పోయారు. రేవంత్‌ పట్టించుకోకపోతే ఆయననూ ప్రజలు వదిలిపెట్టరు’ అని హెచ్చరించారు. రాజకీయ పార్టీ పెడతానంటే తనపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి తెలంగాణ పదం ఉండేలా పార్టీ పెడతానని ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో వ్యాఖ్యానించారు.

News February 12, 2026

తేమ అవసరం.. అతి తేమతో పంటకు ప్రమాదం

image

పంట ఎదుగుదలకు నేలలో తగినంత తేమ అవసరం. అయితే పరిమితికి మించి తేమ, నీరు నిల్వ ఉంటే మాత్రం నేలలో గాలి ప్రసరణ తగ్గి, వేర్లకు ఆక్సిజన్ అందక శ్వాసప్రక్రియ మందగిస్తుంది. దీని వల్ల వేర్లు కుళ్లి, తెగుళ్లు ఆశించి మొక్క ఎదుగుదల నిలిచిపోయి పంట దిగుబడి తగ్గుతుంది. తేమ మరీ ఎక్కువైతే మొక్కలు చనిపోతాయి. టమాటా, మిర్చి, వంకాయ, కీరదోస, బత్తాయి, ద్రాక్షల్లో అధిక తేమతో వేరుకుళ్లు సహా ఇతర సమస్యల ముప్పు పెరుగుతుంది.