News March 24, 2024
2 నుంచి ముత్యాలమ్మ జాతర

చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో ఏప్రిల్ 2 నుంచి శ్రీ ముత్యాలమ్మ జాతర జరగనుంది. మొదటి రోజు శ్రీపోలేరమ్మ నిలుపు అనంతరం ఉదయం 5 గంటలకు అమ్మవారికి దిష్టి తీసిన తర్వాత బంగారు చీరతో అలంకరిస్తారు. ఆ రోజు రాత్రి సింహవాహన సేవ జరుగుతుంది. 3న యార, గొల్లల ఉత్సవం 4న గురునాథ స్వామి గ్రామోత్సవం నిర్వహిస్తారు. 5 పోలేరమ్మను సాగనంపుతారు. లక్షల మంది భక్తుల రాక నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News April 20, 2025
నెల్లూరులో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు ప్రారంభం

నెల్లూరు జిల్లా చెస్ అసోసియేషన్ శ్రీ ఆనంద్ చెస్ వింగ్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని సిల్వర్ బాక్స్ పాఠశాలలో రాష్ట్రస్థాయి చెస్ పోటీలను అప్సానాతో వెంకటాద్రి నాయుడు, చెస్ రాష్ట్ర కార్యదర్శి సుమన్ ఆదివారం ప్రారంభించారు. 280 మంది క్రీడాకారులు 2 ఉభయ రాష్ట్రాల నుంచి పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన విజేతకు నగదగతో పాటు, మెమొంటో, ప్రశంసా పత్రం అందజేస్తారని గోపీనాథ్, డాక్టర్ మధు తెలిపారు.
News April 20, 2025
నెల్లూరు: హెల్త్ ఆఫీసర్ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ

నెల్లూరు కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ చైతన్య ఆదివారం బుల్లెట్ వాహనంపై పర్యటించి పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించారు. ధనలక్ష్మిపురం, నారాయణ మెడికల్ కాలేజ్ రోడ్లలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. మస్టర్లను పరిశీలించి శానిటేషన్ సెక్రటరీలకు సూచనలు చేశారు. కార్మికుల హాజరు శాతం తక్కువగా ఉండడంతో ఆదివారం కూడా పనికి వచ్చే కార్మికుల సంఖ్య తగ్గకుండా చూడాలని ఆదేశించారు.
News April 20, 2025
మనుబోలు: పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు

మనుబోలు మండలంలోని వడ్లపూడి వద్ద ఆదివారం కారు బోల్తా పడి అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఐదుమంది ఉన్నారు. వీళ్లంతా సురక్షితంగా బయటపడ్డారు. పొదలకూరు మండలం బిరదవోలు రాజుపాలెంకు చెందిన వారు కొత్త కారును కొనుగోలు చేసి గొలగమూడిలో పూజలు చేయించుకొని తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.