News November 8, 2025
2 నెలల్లో 2,717 మందిపై కేసు: SP

సెప్టెంబర్, అక్టోబరులో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 2,182 మందిపై కేసులు నమోదు చేసినట్లు బాపట్ల SP ఉమామహేశ్వర్ శనివారం తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 535 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. మొత్తం 2,717 మందిపై కేసులు నమోదయ్యాయన్నారు. 4 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 224 ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసి, నిబంధనలు పాటించని 55 వాహనాలకు రూ.1,57,405ల నగదు జరిమానా విధించామన్నారు.
Similar News
News November 8, 2025
ఆసీస్‌తో అయిపోయింది.. సౌతాఫ్రికాతో మొదలవుతుంది

ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా టూర్ నేటితో ముగిసింది. రేపు ఆటగాళ్లు స్వదేశానికి రానున్నారు. ఈనెల 14(కోల్‌కతా) నుంచి సౌతాఫ్రికాతో 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. 22న(గువాహటి)లో సెకండ్ టెస్ట్ జరగనుంది. తర్వాత 3 వన్డేల సిరీస్ మొదలవుతుంది. 30న తొలి, DEC 3న రెండో, 6న మూడో వన్డే ఆడతారు. అనంతరం 5 టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. 9న తొలి, 11న రెండో, 14న మూడో, 17న నాలుగో, 19న ఐదో టీ20 జరుగుతుంది.
News November 8, 2025
నాగర్ కర్నూల్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

√ఊర్కోండ మండల కేంద్రంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు
√ఈనెల 11న కల్వకుర్తి ఐటిఐ కళాశాలలో అప్రెంటిషిప్ మెళా
√రాష్ట్రస్థాయిలో విజయం సాధించిన జిల్లా ఖోఖో జట్టు
√సోమశిల లో శ్రీశైలం లాంచీ నీ ప్రారంభించిన జిల్లా పర్యాటకశాఖ అధికారి
√NGKL: రేపు కబడ్డీ ఎంపికలు
√ఊర్కోండ పేటలో పెరిగిన భక్తుల రద్దీ.
News November 8, 2025
కొత్తగా CDF పోస్టు… పాక్ ఆర్మీలో కీలక మార్పు!

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ రక్షణ వ్యవహారాల్లో పలు మార్పులు వస్తున్నాయి. భారత CDS మాదిరిగా కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF) పేరిట కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సుల బాధ్యత అప్పగిస్తారని ‘GEONEWS’ పేర్కొంది. సైన్యంపై అధికారం అధ్యక్షుడు, ప్రభుత్వానికి కాకుండా CDFకు ఉంటుందని తెలిపింది. త్వరలో రిటైర్ కానున్న ఆర్మీ చీఫ్ మునీర్ రేసులో ఉన్నారని వెల్లడించింది.


