News November 29, 2025
2 మండలాలుగా ఆదోని.. 30రోజుల గడువు

కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని రెండుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని కలెక్టర్ డా. ఎ.సిరి శుక్రవారం తెలిపారు. ఆదోని, పెద్ద హరివాణం మండలాలుగా ఈ విభజన జరిగింది. దీనిపై ప్రజలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే, 30 రోజుల్లోపు లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
Similar News
News December 1, 2025
నేతివానిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా తిరుపతమ్మ నామినేషన్

మల్దకల్ మండలం నేతువానిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి మహిళా నాయకురాలు తిరుపతమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, గ్రామ ప్రజలు ఏకతాటిపైకి వచ్చి సహకరించాలని కోరారు. అంబేడ్కర్ ఇచ్చిన ఓటు హక్కును అమ్ముకోకుండా నిజాయితీ గల వారికి ఓటు వేయాలన్నారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు తిమ్మప్ప, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
News December 1, 2025
ఇతిహాసాలు క్విజ్ – 83 సమాధానాలు

నేటి ప్రశ్న: శివారాధనకు సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అందుకు కారణమేంటి?
సమాధానం: సోమవారానికి సోముడు అధిపతి. సోముడంటే చంద్రుడే. ఆ చంద్రుడిని శివుడు తన తలపై ధరిస్తాడు. అలా సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైనదిగా మారింది. జ్యోతిషం ప్రకారం.. సోమవారం రోజున శివుడిని పూజిస్తే చంద్రుడి ద్వారా కలిగే దోషాలు తొలగి, మానసిక ప్రశాంతత, అదృష్టం లభిస్తాయని నమ్మకం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 1, 2025
అనకాపల్లి: తుఫాను భయం.. రైతులకు సూచనలివే

దిత్వా తుఫాన్ నేపథ్యంలో రైతులు వరికోతలను రెండుమూడు రోజులు వాయిదా వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి విజ్ఞప్తి చేశారు. పరిస్థితిలు అనుకూలించిన తర్వాత మాత్రమే కోతలు ప్రారంభించాలన్నారు. కోసిన వరి పనలు తడిస్తే నూర్చి ఎండలో ఎండ పెట్టాలన్నారు. ప్రతి క్వింటాల్ ధాన్యానికి ఒక కిలో ఉప్పు, 20 కిలోల ఊకపొడి కలపాలన్నారు. మొలకలు రాకుండా ఉండేందుకు ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేయాలన్నారు.


