News February 24, 2026

2 రోజులు తిరుపతి ఐజర్‌లో కార్యక్రమాలు

image

ఏర్పేడులోని తిరుపతి IISERలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఫిబ్రవరి 28, మార్చి 2వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఆ రెండు రోజులు ఉదయం 8:30గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. 200కు పైగా శాస్త్రీయ ప్రదర్శనలు, ప్రత్యక్ష ప్రయోగాలు చేపడతారు. మార్చి 2న కౌస్తావ్ సాన్యాల, రుచి ఆనంద్, ధనంజయ శర్మ ప్రత్యేక ఉపన్యాసాలు ఇస్తారు.

Similar News

News February 26, 2026

WGL: 7 కాలేజీలు.. 1,980 సీట్లు..!

image

పాలిసెట్ (POLYCET) 2026-27 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 20 వరకు దరఖాస్తుకు అవకాశం ఉండగా, మే 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని 7 పాలిటెక్నిక్ కళాశాలల్లో మొత్తం 1,980 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాటారం పాలిటెక్నిక్ కళాశాలలో ఈ ఏడాది నుండి కొత్తగా ‘డిప్లమా ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్’ కోర్సులు ప్రారంభమవుతున్నాయని ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు.

News February 26, 2026

తిరుపతి: లవర్‌కు పెళ్లి.. యువకుడి ఆత్మహత్య!

image

చంద్రగిరి RF రోడ్డులో విషాదం నెలకొంది. కడప జిల్లాకు చెందిన సాధిక్ అనే యువకుడు తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక ఏసీ మెకానిక్ షాపులో పనిచేస్తున్న సాధిక్, పనికి రాకపోవడంతో యజమాని గదికి వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. తాను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.

News February 26, 2026

RR: తల్లి మరణించినా ఎగ్జామ్‌కు హాజరు

image

రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లిలో హృదయాన్ని కదిలించిందీ ఘటన. కేజీబీవీలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న కల్పన (40) మంగళవారం రాత్రి మరణించారు. బుధవారమే ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో, ఆమె కుమారుడు రవితేజ మాత్రం పరీక్షకు వెళ్లాలనుకున్నాడు. తల్లి మృతదేహం ఇంట్లోనే ఉండగా.. పరీక్ష పూర్తి చేసి అనంతరం తల్లి అంత్యక్రియలకు హాజరయ్యాడు.