News September 22, 2024
2 రోజులు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రద్దు

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా గుంటూరు(GNT)- విశాఖపట్నం(VSKP) మధ్య ప్రయాణించే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను రెండు రోజులపాటు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు నం.17239 GNT-VSKP మధ్య ప్రయాణించే రైలును ఈ నెల 29, 30వ తేదీల్లో, నం.12740 VSKP-GNT రైలును ఈ నెల 30, అక్టోబర్ 1వ తేదీన రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
Similar News
News November 9, 2025
6,000 మందితో గీతా పారాయణం

విశాఖపట్నంలోని పోర్ట్ ఇన్‌డోర్ స్టేడియంలో ఆదివారం భగవద్గీత పారాయణం నిర్వహించారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో 6,000 మందికి పైగా భక్తులు ఏకస్వరంతో 700 శ్లోకాల భగవద్గీత పారాయణం చేశారు. 3 గంటలకు పైగా సాగిన ఈ మహా పారాయణంలో గీతా శ్లోకాలు ప్రతిధ్వనిస్తూ ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమాన్ని ఓ ఫౌండేషన్-అవధూత దత్త పీఠం నేతృత్వంలో నిర్వహించారు.
News November 9, 2025
ఏపీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారుతుంది: మంత్రి కొండపల్లి

విశాఖలో ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సును ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. ఈ సదస్సుకు 16 దేశాల నుంచి 44 మంది డెలిగేట్‌లు హాజరయ్యారు. ఏపీని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు. MSMEలకు ఇప్పటికే రూ.439 కోట్ల మేర ప్రోత్సాహకాలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.
News November 9, 2025
విశాఖ సీపీ కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్ రద్దు

విశాఖ సీపీ కార్యాలయంలో రేపు జరగబోయే పీజీఆర్ఎస్‌ను రద్దు చేసినట్లు సీపీ శంక బ్రత బాగ్చి తెలిపారు. జిల్లా పోలీస్ యంత్రాంగం CII పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ ఏర్పాట్లలలో, భద్రత చర్యలలో ఉన్నందున PGRSను తాత్కాలికంగా రద్దు చేసామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని సీపీ కోరారు. అలాగే జీవీఎంసీలో కూడా రేపు పీజీఆర్ఎస్ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.


