News November 1, 2025
2 రోజుల్లో అల్పపీడనం.. AP, TGలో వర్షాలు

రానున్న 2 రోజుల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 2 రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వానలు పడతాయని పేర్కొంది. ఇవాళ కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. అటు TGలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముంది.
Similar News
News November 1, 2025
పోలవరం నిర్వాసితులకు ₹1,000 కోట్ల పరిహారం.. నేడే పంపిణీ

AP: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పునరావాసం కింద మరో రూ.వెయ్యి కోట్లను వారికి చెల్లించనుంది. నేడు ఏలూరు జిల్లా వేలేరుపాడులో జరిగే కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు వారికి చెక్కులను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా తెరిచిన ఖాతా నుంచి లబ్ధిదారులకు సొమ్ము జమ కానుంది. ఈ ఏడాది జనవరిలో కూడా ప్రభుత్వం రూ.900 కోట్లను నిర్వాసితులకు విడుదల చేసింది.
News November 1, 2025
కొబ్బరిపాలతో చర్మ సంరక్షణ

వంటల్లో ఎక్కువగా వాడే కొబ్బరి పాలు సౌందర్య సంరక్షణలో కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, కాపర్ చర్మంపై మృతకణాలను తొలగిస్తాయి. దాంతో పాటు ముడతలు, మచ్చలు తగ్గించి యవ్వన చర్మాన్ని ఇస్తాయి. మొటిమలు, ఎగ్జిమా, సొరియాసిస్ వంటి చర్మ సమస్యలను తగ్గిస్తాయని చెబుతున్నారు. అలాగే వీటిని జుట్టుకు పట్టిస్తే కుదుళ్లను దృఢంగా చేస్తాయని చెబుతున్నారు.
News November 1, 2025
నేడు లండన్ వెళ్లనున్న సీఎం దంపతులు

AP: CM చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ఇవాళ లండన్ వెళ్లనున్నారు. ఈనెల 4న ఆమె డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ <<17985147>>అవార్డును<<>> అందుకోనున్నారు. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ తరఫున గోల్డెన్ పీకాక్ పురస్కారాన్నీ భువనేశ్వరి స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన అనంతరం CM చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. విశాఖలో జరిగే CII సదస్సుకు వారిని ఆహ్వానిస్తారు. ఈనెల 6న తిరిగి అమరావతి చేరుకుంటారు.


