News October 11, 2025
2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: జేసీ

విజయవాడ: జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆమె జిల్లాలోని రైస్ మిల్లర్లకు, పౌర సరఫరాల శాఖ అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ నెల 15వ తేదీలోపు బ్యాంక్ గ్యారంటీలు సమర్పించాలన్నారు. గోనె సంచులను కొనుగోలు కేంద్రాలకు పంపించాలని మిల్లర్లకు సూచించారు.
Similar News
News October 11, 2025
OU: హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

ఓయూ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సుల ఆరో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజును ఈ నెల 22వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలన్నారు. ఈ పరీక్షలను ఈ నెలలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.
News October 11, 2025
సెహ్వాగ్ సాయం.. U19 జట్టులో పుల్వామా అమరవీరుడి కుమారుడు!

పుల్వామా దాడిలో అమరుడైన విజయ్ సోరెంగ్ కుమారుడు రాహుల్ హరియాణా U19 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. గత ఐదేళ్లుగా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తన స్కూలులో రాహుల్‌కు ఉచిత విద్య, క్రికెట్ ట్రైనింగ్ అందిస్తున్నారు. U19 టీమ్‌కు రాహుల్ ఎంపికవడం గర్వంగా ఉందని సెహ్వాగ్ తెలిపారు. రాహుల్ గతంలో హరియాణా U14, U16 జట్లకు ఆడాడు. కాగా మరో అమర జవాన్ రామ్ వకీల్ తనయుడు అర్పిత్ కూడా సెహ్వాగ్ స్కూలులోనే చదువుతున్నాడు.
News October 11, 2025
కరీంనగర్‌లో ఈనెల15 న జాబ్ మేళా

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగులకు ఈ నెల 15న జాబ్ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి వయస్సు 25-30 లోపు ఉండాలని.. ఆసక్తిగల వారు ఉపాధి కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.