News July 31, 2024

నాగార్జున సాగర్‌కు 2.20 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో

image

నాగార్జున సాగర్ జలాశయానికి శ్రీశైలం నుంచి 2.20 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 165.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు ఏకంగా 21 టీఎంసీల నీరు చేరింది. ఎగువన ఉన్న ఆల్మట్టితో పాటు తుంగభద్ర డ్యాంలకు భారీ వరద కొనసాగుతోంది. ఆ నీరంతా సాగర్ జలాశయానికి రానుంది.

Similar News

News February 2, 2025

బ్యూటిఫుల్ ఫొటో: లెజండరీ టు యంగ్‌స్టర్స్

image

ముంబైలో BCCI అవార్డుల వేడుక వైభవంగా జరిగింది. లెజెండరీ క్రికెటర్ సచిన్‌ CK నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. బెస్ట్ మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా బుమ్రా పాలీ ఉమ్రిగర్, అశ్విన్ స్పెషల్ అవార్డును గెలుచుకున్నారు. అలాగే పలు కేటగిరీల్లో స్మృతి, సర్ఫరాజ్, దీప్తి శర్మ, ఆశా శోభన, U-16, 23, దేశవాళీ ఆటగాళ్లకు పురస్కారాలు లభించాయి. వీరందరూ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటో ఆకట్టుకుంటోంది.

News February 2, 2025

కేంద్ర బడ్జెట్‌పై నేడు కాంగ్రెస్ ధర్నా

image

TG: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ప్రభుత్వ పెద్దలు వివక్ష చూపారని కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరసనకు దిగనుంది. HYDలోని ట్యాంక్ బండ్ వద్ద భారీ ధర్నాను నిర్వహించనున్నట్లు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. అలాగే రేపు రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. PM, కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలన్నారు.

News February 2, 2025

GOOD NEWS: వారికి రూ.25,000

image

TG: మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నదీ పరివాహక ప్రాంతం నుంచి వారిని తరలించేందుకు రవాణా ఖర్చుల నిమిత్తం రూ.37.50 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ ఉత్తర్వులిచ్చారు. 15వేల కుటుంబాలకు రూ.25,000 చొప్పున సాయం చేస్తామన్నారు. HYD, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని అర్హులను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు.