News August 28, 2024

జన్‌ధన్ అకౌంట్లలో రూ.2.31 లక్షల కోట్లు

image

ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన(PMJDY)ను ప్రారంభించి నేటికి పదేళ్లయ్యింది. 2015 మార్చికి 14.71కోట్ల ఖాతాల్లో ₹15,670cr డిపాజిట్లు ఉండగా, ఈ ఏడాది AUG 16కు 53.14కోట్ల అకౌంట్లలో ₹2.31L cr మొత్తం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మరో 3 కోట్ల ఖాతాలు తెరిచే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. ఈ అకౌంట్లు ఓపెన్ చేసేందుకు, నిర్వహణకు ఛార్జీలుండవు. ₹2లక్షల ప్రమాద బీమాతో ఉచిత రూపే డెబిట్ కార్డు కూడా ఇస్తారు.

Similar News

News November 8, 2025

న్యూస్ అప్‌డేట్స్ 10@AM

image

* తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న A-16 అజయ్ కుమార్ సుగంధ్‌ అరెస్టు. భోలేబాబా కంపెనీకి కెమికల్స్ ఉన్న పామాయిల్ సప్లై చేసినట్లు గుర్తింపు
*తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన. పలమనేరులో కుంకీ ఏనుగుల క్యాంపును సందర్శించనున్న పవన్
*బిహార్ తొలి దశ పోలింగ్‌లో 65.08% ఓటింగ్ నమోదు: ఈసీ
*ఢిల్లీలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని విమాన సర్వీసులు

News November 8, 2025

PDILలో 87 ఇంజినీర్ ఉద్యోగాలు

image

నోయిడాలోని ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్(<>PDIL<<>>)87 కాంట్రాక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీడీఎం, BCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.pdilin.com

News November 8, 2025

తెలంగాణలో యాసంగి సాగుకు అనువైన వేరుశనగ రకాలు

image

TG: యాసంగి నీటి వసతి కింద రాష్ట్రంలో సాగుకు అనువైన వేరుశనగ రకాలు కదిరి-6, కదిరి-7, కదిరి-8, కదిరి-9, కదిరి హరితాంధ్ర (కె-1319), కదిరి లేపాక్షి (కె-1812), ధరణి (T.C.G.S-1043), నిత్యహరిత (T.C.G.S-1157), విశిష్ట (T.C.G.S-1694), జగిత్యాల పల్లి (జె.సి.జి. 2141), టి.ఏ.జి-24, అభయ, ఇ.సి.జి.వి-9114, జగిత్యాల-88 (జె.సి.జి-88), గిర్నార్-4 (జి.సి.జి.వి-15083), గిర్నార్-5(ఐ.సి.జి.వి-15090) మొదలైనవి.