News November 21, 2024

మండలానికి 2 అంబులెన్సులు: మంత్రి రాజనర్సింహ

image

TG: రాష్ట్రంలోని ప్రతి మండలంలో రెండు అంబులెన్సులు ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. మంచిర్యాలలో ఆయన మాట్లాడారు. ‘మండల కేంద్రంలోనే రోగికి 90 శాతం చికిత్స జరగాలి. రోగులను వైద్యులు తమ క్లయింట్లుగా భావించాలి. రాష్ట్రంలో ఇప్పటికే 7 వేలకుపైగా నర్సు పోస్టులు భర్తీ చేశాం. ఇకపై మెడికల్ స్టాఫ్ కొరత ఉందని, అందుబాటులో లేరనే విమర్శలు రావొద్దు’ అని పేర్కొన్నారు.

Similar News

News November 22, 2024

మణిపుర్‌‌కు మ‌రో 10,800 మంది జవాన్లు

image

మ‌ణిపుర్‌కు కేంద్రం మ‌రో 90 కంపెనీల నుంచి 10,800 మంది జవాన్లను పంప‌నుంది. మే, 2023 నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో 258 మంది మృతి చెందారు. తాజాగా CRPF, BSF, ITBP, SSB నుంచి అద‌న‌పు బ‌ల‌గాల మోహ‌రింపుతో మొత్తం 288 కంపెనీల సిబ్బంది అక్కడి ప‌రిస్థితుల్ని పర్యవేక్షించనున్నారు. Nov 7న జిరిబమ్‌‌లో హ్మర్ తెగకు చెందిన మహిళను అనుమానిత మైతేయి మిలిటెంట్లు రేప్ చేసి కాల్చి చంపడంతో తిరిగి ఘర్షణ చెలరేగింది.

News November 22, 2024

ఇటలీ ప్రధాని మెలోనికి PM మోదీ గిఫ్ట్

image

నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాల్లో పర్యటించిన ప్రధాని మోదీ వివిధ దేశాధినేతలకు బహుమతులు ఇచ్చారు. జీ20 సమావేశాల్లో ఇటలీ ప్రధాని మెలోనికి సిల్వర్ క్యాండిల్ స్టాండ్, పోర్చుగల్ ప్రధానికి సిల్వర్ చెస్ సెట్, ఆస్ట్రేలియా ప్రధానికి సిల్వర్ క్యామెల్ హెడ్ అందజేశారు. మోదీ విదేశాలకు వెళ్లేటప్పుడు MH, జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఝార్ఖండ్, కర్ణాటక, తమిళనాడు, యూపీ, లద్దాక్, ఒడిశాకు చెందిన హస్తకళలు తీసుకెళ్లారు.

News November 22, 2024

కోటి కుటుంబాలకు సర్వే పూర్తి

image

TG: రాష్ట్రవ్యాప్తంగా కోటి కుటుంబాలకు సమగ్ర ఇంటింటి సర్వే పూర్తయిందని ప్రభుత్వం వెల్లడించింది. ములుగు, జనగామ జిల్లాల్లో 100 శాతం, నల్గొండ, మెదక్ జిల్లాల్లో 99.9 శాతం సర్వే పూర్తయినట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.16 కోట్ల నివాసాలు గుర్తించామని, నేటి వరకు 1.01 కోట్ల నివాసాల్లో సర్వే కంప్లీట్ చేసి 87.1 శాతం సాధించామని వివరించింది.