News October 1, 2024

సర్పంచ్ పదవికి వేలంపాటలో రూ.2 కోట్లు

image

పంజాబ్ గురుదాస్‌పూర్ జిల్లాలోని హర్దోల్‌వాల్ కలన్ గ్రామ సర్పంచ్ ఎన్నిక సంచలనంగా మారింది. అక్కడ పోలింగ్ లేకుండా పదవి కోసం గ్రామస్థులు రూ.50లక్షలతో వేలంపాట నిర్వహించారు. బీజేపీ నేత ఆత్మా సింగ్ రూ.2 కోట్లకు పదవిని సొంతం చేసుకున్నారు. 30ఏళ్లుగా అక్కడ ఏకగ్రీవ ఎన్నిక కొనసాగుతోంది. వేలంపాట నిధులను గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియను పలువురు విమర్శిస్తుండగా, మరికొందరు సమర్థిస్తున్నారు.

Similar News

News November 6, 2025

MOILలో 99 ఉద్యోగాలు

image

మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్(<>MOIL<<>>)లో 99 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. ఎలక్ట్రీషియన్, మెకానిక్ కమ్ ఆపరేటర్ , మైన్ ఫోర్‌మెన్, సెలక్షన్ గ్రేడ్ మైన్ ఫోర్‌మెన్, మైన్‌మేట్, బ్లాస్టర్ గ్రేడ్ పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.295. వెబ్‌సైట్: https://www.moil.nic.in/

News November 6, 2025

‘బాహుబలి-ది ఎపిక్’.. రూ.50 కోట్లు దాటిన కలెక్షన్లు!

image

బాహుబలి-ది ఎపిక్ సినిమా కలెక్షన్లు రూ.50 కోట్లు దాటినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. 6 రోజుల్లో దాదాపు రూ.53 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లకు పైగా, కర్ణాటకలో రూ.5 కోట్లు, విదేశాల్లో రూ.12 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం వసూళ్లు రూ.60 కోట్లు దాటొచ్చని అంచనా వేస్తున్నారు.

News November 6, 2025

బిహార్ అప్డేట్: 11 గంటల వరకు 27.65% పోలింగ్

image

బిహార్‌లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 27.65 శాతం పోలింగ్ నమోదైంది. కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులుదీరారు. సీఎం నితీశ్ కుమార్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.