News January 31, 2025
వారంలో 2 రోజులు సెలవు?

బ్యాంక్ ఉద్యోగులు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్న వారంలో రెండు రోజుల సెలవు విజ్ఞప్తిపై రేపు స్పష్టత రానుంది. వారంలో 5 పనిదినాలే ఉండాలని ఉద్యోగులు కోరుతుండగా, రేపటి బడ్జెట్ సమావేశంలో కేంద్రం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. 2 రోజుల సెలవుకు కేంద్రం అంగీకరిస్తే శని, ఆదివారాలు మినహా మిగతా రోజుల్లో అదనంగా 40 నిమిషాలు(ఉ.9.40 నుంచి సా.5.30) పనిచేయాల్సి ఉంటుంది.
Similar News
News January 17, 2026
సార్.. జాబ్ క్యాలెండర్ ప్లీజ్: నిరుద్యోగులు

AP: ఇచ్చిన మాట ప్రకారం ఈ నెలలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుతున్నారు. జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ గతంలో <<18617902>>ప్రకటించిన<<>> విషయాన్ని గుర్తుచేస్తున్నారు. 25వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటూ Xలో పోస్టులు పెడుతున్నారు. ఉద్యోగాల కోసం లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అంటున్నారు.
News January 17, 2026
ఏపీ నుంచి వచ్చే వాహనాల దారి మళ్లింపు

సంక్రాంతి సెలవులు ముగియడంతో AP నుంచి HYDకు వాహనాల రద్దీ పెరిగింది. NH-65 విస్తరణ పనుల దృష్ట్యా అధికారులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. గుంటూరు నుంచి HYD వచ్చే వెహికల్స్ను మిర్యాలగూడ-హాలియా-చింతపల్లి-మాల్, మాచర్ల-సాగర్-పెద్దవూర-చింతపల్లి-మాల్ మీదుగా, విజయవాడ నుంచి వచ్చే వాటిని కోదాడ-మాల్ నుంచి HYDకు పంపిస్తున్నారు. NH-65పై ట్రాఫిక్ జామ్ ఏర్పడితే చిట్యాల నుంచి భువనగిరి మీదుగా దారి మళ్లించనున్నారు.
News January 17, 2026
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<


