News December 2, 2024

నేటి నుంచి ముంబైకి 2 విమాన సర్వీసులు

image

AP: రాజమండ్రి, తిరుపతి నుంచి ముంబైకి కొత్తగా రెండు ఇండిగో విమాన సర్వీసులు నేడు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజూ సా.4.50కి ముంబైలో బయలుదేరి రా.6.45కు రాజమండ్రికి, తిరిగి అక్కడి నుంచి రా.7.15 ప్రారంభమై రా.9.05 గంటలకు ముంబై చేరుకుంటుంది. మరో విమానం ఉ.5.30కు ముంబై నుంచి బయలుదేరి ఉ.7.15కు తిరుపతికి, అక్కడి నుంచి ఉ.7.45కు బయలుదేరి ఉ.9.25కు ముంబైకి చేరుకుంటుంది.

Similar News

News March 28, 2026

మూసీ పునరుద్ధరణ: ఆలయానికి సీఎం రేవంత్ శంకుస్థాపన

image

TG: రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. 8 ఎకరాల్లో రూ.700 కోట్లతో ఈ నిర్మాణాన్ని మూసీ పునరుద్ధరణలో భాగంగా ప్రభుత్వం చేపడుతోంది. ఆలయంలో వంద అడుగుల గాలి గోపురం, మూసీ నది మధ్యలో వంద అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. నదీజలాలను కాపాడుకోవడం మన బాధ్యత అని సీఎం రేవంత్ చెప్పారు.

News March 28, 2026

తాటి ముంజలు.. పోషకాల గనులు

image

వేసవిలో ఎక్కువగా లభించే తాటి ముంజల్లో విటమిన్ A, B, C, ఐరన్, జింక్, పొటాషియం లాంటి పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘వీటిని తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, ఎసిడిటీ, కాలేయ సమస్యలు తగ్గుతాయి. నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గడంలోనూ సాయపడతాయి’ అని పేర్కొంటున్నారు. తాటి ముంజలంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.
#ShareIt

News March 28, 2026

యుద్ధంలో ఇరాన్‌కు రోజుకు ₹1,319 కోట్ల ఆదాయం

image

ప్రపంచవ్యాప్త ఇంధన సంక్షోభం ఇరాన్‌కు వరంగా మారింది. హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించిన ఆ దేశం ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్ ద్వారా రోజుకు ₹1,319 కోట్ల ఆదాయాన్ని గడిస్తోంది. ఇతర గల్ఫ్ దేశాలు రవాణా చేయలేక సతమతమవుతుంటే ఇరాన్ మాత్రం రోజుకు 16 లక్షల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తూ లాభపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం, ఇరాన్ మౌలిక సదుపాయాలు సేఫ్‌గా ఉండటంతో ఆ దేశానికి ఆర్థికంగా కలిసొస్తోంది.