News May 19, 2024

2 Hr’s పాటు నిలిచిపోయిన సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్

image

హనుమకొండ జిల్లా ఉప్పల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. అందులో సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్‌ను ఉప్పల్ స్టేషన్‌లో నిలిపివేశారు. తర్వాత అహ్మదాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్‌ను నిలిపివేశారు. రెండు గంటలు రైళ్లు నిలిపివేయడంతో ప్రయాణీకులు ఆందోళనకు దిగారు.

Similar News

News December 27, 2024

సిర్పూర్ (టి): ‘అడవుల సంరక్షణ అందరి బాధ్యత’

image

అటవీ సంరక్షణ అభివృద్ధిలో ఉద్యోగులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని కంపా పిసిసిఎఫ్ సువర్ణ అన్నారు. సిర్పూర్ టి రేంజ్ పరిధిలోని ఇటుకల పహాడ్ గ్రామాన్ని సిఎఫ్ శాంతారాం, డిఎఫ్ఓ నీరజ్ కుమార్‌తో కలిసి సందర్శించి అక్కడ కంపా నిధులతో చేసిన ప్లాంటేషన్ పరిశీలించి అనంతరం గ్రామస్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్లాంటేషన్ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని అన్నారు.

News December 26, 2024

నిర్మల్ : ‘కేజీబీవీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి’

image

కేజీబీవీ, సమగ్రశిక్షా ఉద్యోగులు నిరసన చేపడుతున్న సందర్భంగా ఆయా మండలాల్లో కస్తూర్బా విద్యాలయాల్లో ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలని డీఈవో రామారావు ఎంఈవోలను గురువారం ప్రకటనలో ఆదేశించారు. వారు కేజీబీవీ పాఠశాలల్లో వంట మనుషులు, వాచ్మెన్‌లు , టీచింగ్ స్టాఫ్‌ను సర్దుబాటు చేయాలని ఎంఈఓలకు సూచించారు.

News December 26, 2024

నిర్మల్‌: చెత్త కవర్‌లో శిశువు మృతదేహం లభ్యం

image

మున్సిపల్ చెత్త వాహనంలో నవజాత శిశువు లభ్యమైన ఘటన గురువారం నిర్మల్‌లో చోటుచేసుకుంది. నిర్మల్ మున్సిపాలిటీకి చెందిన ఓ వాహనం చెత్త పడేయడానికి డంపింగ్ యార్డ్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో ఓ కవర్ కింద పడింది. సిబ్బంది దాన్ని పరిశీలించగా అందులో నవజాత శిశువు మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు.