News October 21, 2024
జగన్ హయాంలో మహిళలపై 2 లక్షల నేరాలు: వర్ల రామయ్య

AP: ఆడబిడ్డల రక్షణ గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. ఆయన హయాంలో మహిళలపై 2 లక్షల నేరాలు జరిగాయని ఆరోపించారు. అప్పుడు శాంతిభద్రతలు ఏమయ్యాయని నిలదీశారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో తిరోగమించిందన్నారు. గంజాయి, డ్రగ్స్‌తో యువత భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో స్త్రీలపై దారుణాలు జరుగుతున్నాయని ఇటీవల జగన్ విమర్శించిన విషయం తెలిసిందే.
Similar News
News February 5, 2026
T20WC: టీమ్ ఇండియాకు గాయాల భయం!

రెండ్రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం అవుతుండటంతో ఇద్దరు టీమ్ ఇండియా ప్లేయర్ల ఫిట్నెస్ విషయంలో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. నిన్న SAతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో హర్షిత్ రాణా ఒకే ఓవర్ వేసి కాసేపటికే మైదానాన్ని వీడారు. ఏదో నొప్పితో బాధపడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. న్యూజిలాండ్ సిరీస్‌లో గాయపడిన సుందర్ ఇంకా కోలుకోలేదు. ఎప్పుడు జట్టుకు అందుబాటులోకి వస్తారన్న దానిపై స్పష్టత లేదు.
News February 5, 2026
$400bn మార్కును దాటిన గూగుల్ రెవెన్యూ: సుందర్ పిచాయ్

గూగుల్ యాన్యువల్ రెవెన్యూ తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల మార్కును క్రాస్ చేసిందని సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. FY25 Q4 ఫలితాలను ఆయన వెల్లడించారు. 2025లో యూట్యూబ్ రెవెన్యూ 60 బిలియన్ డాలర్లను దాటినట్లు పేర్కొన్నారు. జెమినీ యాప్ మంత్లీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 750M+గా ఉన్నట్లు చెప్పారు. AI స్టాక్, జెమినీ 3 అడాప్షన్ తమ కంపెనీ ప్రోగ్రెస్‌కి ఫ్యూయల్‌లా పనిచేస్తున్నాయని వివరించారు.
News February 5, 2026
ఎయిమ్స్ గోరఖ్‌పూర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

<


