News November 14, 2024
ఇళ్ల పట్టాల్లో రూ.2 లక్షల కోట్ల అవినీతి: ఎమ్మెల్యే బండారు

AP: టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అసెంబ్లీలో సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా రూ.2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి విశాఖలోనే రూ.40,000 కోట్లు దోచేశారన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారించాలని డిమాండ్ చేశారు. తాను అవినీతిని నిరూపించలేకపోతే ఏ శిక్షకైనా సిద్ధమేనని ప్రకటించారు.
Similar News
News February 14, 2026
కూలి కూటికిరాదు, లేకి చేతికిరాదు

వ్యవసాయం, వ్యాపారం ఏదైనా అన్ని పనులకూ కూలీల మీదే ఆధారపడితే చేతికి వచ్చే లాభం కూలీలకే సరిపోతుంది. యజమానికి కనీసం తిండికి కూడా మిగలదు. అందుకే సాధ్యమైనంత వరకు మన పనులను మనమే చేసుకోవాలి. అలాగే ఇతరులకు పని అప్పగించేటప్పుడు నిర్లక్ష్యం, బాధ్యత లేనివారికి అప్పగిస్తే, ఆ పని పూర్తికాదు సరికదా, ఆశించిన ఫలితం మన చేతికి అందదు. అందుకే పని అప్పగించినా మన పర్యవేక్షణ తప్పక ఉండాలని ఈ సామెత తెలియజేస్తుంది.
News February 14, 2026
‘వీరు ఉపవాసం ఉండకపోవడం ఉత్తమం’

భక్తితో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి గర్భిణీలు ఆరోగ్యం దృష్ట్యా ఉపవాసానికి దూరంగా ఉండటం మేలు. మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు కఠిన ఉపవాసం చేయకూడదంటున్నారు డాక్టర్లు. ‘శారీరక ఇబ్బందులున్న మహిళలు ఉపవాసం మానేయవచ్చు. ఆహారం తీసుకుంటూ శివ నామస్మరణ, ధ్యానం చేస్తే అంతటి సమానమైన పుణ్యం లభిస్తుంది’ అని పండితులు సూచిస్తున్నారు.
News February 14, 2026
మున్సిపల్ ఫలితాలు.. బీజేపీ ‘సున్నా’

TG: 116 మున్సిపాలిటీల్లో BJP ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. ఏకంగా 45 మున్సిపాలిటీల్లో ఒక్క వార్డూ సొంతం చేసుకోలేదు. ఉమ్మడి వరంగల్, MBNR, ఖమ్మం, NLG జిల్లాల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 3 మున్సిపాలిటీల్లో (ఆదిలాబాద్, మెట్‌పల్లి, నారాయణపేట్) మాత్రమే మిగతా పార్టీల కంటే ఎక్కువ వార్డులు గెలుచుకుంది. అయితే బండి సంజయ్ ఒంటరి ప్రచారం తన పార్లమెంటు పరిధిలోని కరీంనగర్ మేయర్ పీఠాన్ని కట్టబెట్టింది.


