News October 30, 2024
ఒక్క ఏడాదిలోనే 2 లక్షల కిరాణా స్టోర్లు మూత.. కారణమిదే?

క్విక్ కామర్స్ దెబ్బతో దేశవ్యాప్తంగా గత ఏడాది 2 లక్షలకు పైగా కిరాణా దుకాణాలు మూతబడినట్లు ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ (AICPDF) అంచనా వేసింది. మెట్రో, టైర్-1 సిటీల్లో క్విక్ కామర్స్ వేగంగా పురోగమిస్తోందని, దీంతో కిరాణా స్టోర్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. డిస్కౌంట్లు, అతితక్కువ సమయంలోనే హోం డెలివరీతో కస్టమర్లు అటువైపు ఆసక్తి చూపుతున్నారని వివరించింది.
Similar News
News February 11, 2026
వేములవాడ రాజన్న భక్తులకు ‘వాట్సాప్’ సేవలు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం సేవలకు సంబంధించిన వివరాలను భక్తులు ఇకపై వాట్సాప్ చాట్ బోట్ ద్వారా పొందవచ్చు. “Services in just a Few Clicks” అనే సందేశంతో భక్తులకు అవసరమైన సమాచారం, సేవలను డిజిటల్ విధానంలో ఆలయ యంత్రాంగం అందుబాటులోకి తీసుకువచ్చింది. 8736936969 నంబర్‌కు వాట్సాప్‌లో “Hi” అని మెసేజ్ పంపి అవసరమైన సేవలు వివరాలు పొందవచ్చని ఆలయ ఈవో రమాదేవి బుధవారం తెలిపారు.
News February 11, 2026
ఇలా చేస్తే గ్యాస్ సిలిండర్ లీక్ అవుతుంది!

గ్యాస్ సిలిండర్ నిండుగా ఉన్నప్పుడు చాలామంది దానిని కింద పడుకోబెట్టి భద్రపరుస్తుంటారు. అయితే ఇలా చేయడం అత్యంత ప్రమాదకరమని కేంద్ర పెట్రోలియం శాఖ హెచ్చరిస్తోంది. సిలిండర్‌ను పడుకోబెట్టడం వల్ల గ్యాస్ లీకేజీ అయి అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. గ్యాస్ లీకేజీలను అరికట్టేందుకు సిలిండర్‌ను ఎల్లప్పుడూ నిలువుగానే ఉంచాలని సూచించింది. SHARE IT
News February 11, 2026
దర్యాప్తు రోజే ఎప్స్టీన్ ద్వీపానికి 330 గ్యాలన్ల యాసిడ్.. ఏం చేశారు?

ఎప్స్టీన్ కేసులో తాజాగా విడుదలైన పత్రాలు విస్తుపోయే విషయాలను బయటపెట్టాయి. 2018 జూన్ 12న FBI దర్యాప్తు మొదలైన రోజే అతని ప్రైవేట్ ఐలాండ్‌కు 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ డెలివరీ అయినట్లు రశీదులు లభించాయి. మృతదేహాలను లేదా సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకే ఇంత భారీ మొత్తంలో యాసిడ్ కొన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే RO ప్లాంట్ నిర్వహణ కోసం దీనిని వాడేవారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.


