News March 31, 2024

2 నెలలు వేసవి సెలవులు.. నేటి నుంచే

image

TG: ఇటీవల ఇంటర్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. మార్చి 31 నుంచి మే 31 వరకు రెండు నెలలపాటు హాలిడేస్ ఉండనున్నాయి. జూన్ 1న జూనియర్ కాలేజీలు తిరిగి తెరుచుకుంటాయి. సెలవుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. అటు ఇంటర్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్‌లో వెలువడే అవకాశాలున్నాయి.

Similar News

News March 10, 2026

జార్జియాకు బై.. అంటార్కిటికాకు ‘వారణాసి’ టీమ్?

image

రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ మూవీ జార్జియా షెడ్యూల్ ముగిసింది. మహేశ్ బాబు, పృథ్వీరాజ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. మూవీ యూనిట్ త్వరలోనే అంటార్కిటికాకు వెళ్లనుందని టాక్. ఈ షెడ్యూల్‌లో సూపర్ స్టార్‌తోపాటు ప్రియాంకా చోప్రా పాల్గొంటారని, అక్కడే ఓ సాంగ్ షూట్ జరుగుతుందని సినీ వర్గాలు వెల్లడించాయి. దీంతో అక్కడి లోకేషన్స్‌లో షూట్ చేసిన తొలి ఇండియన్ మూవీగా నిలవనుందని తెలిపాయి.

News March 10, 2026

వంటగ్యాస్ పొదుపుగా వాడుకుంటే బెటర్!

image

పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత వంటగ్యాస్ సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. కేంద్రం భరోసా ఇచ్చినా బిహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో LPG కొరత కనిపిస్తోంది. గ్యాస్ కోసం భారత్ ప్రధానంగా గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతోంది. దేశంలో చమురు తరహాలో LPGని భారీగా నిల్వ చేసే సామర్థ్యం లేదు. ఈ ఛాలెంజెస్ దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో వంటగ్యాస్‌ను పొదుపుగా వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News March 10, 2026

యుద్ధం ముగించడం మా చేతుల్లో ఉంది: IRGC

image

త్వరలో యుద్ధం ముగుస్తుందన్న <<19341728>>ట్రంప్ కామెంట్లపై<<>> ఇరాన్ IRGC స్పందించింది. ‘యుద్ధం ముగించడం మా చేతుల్లో ఉంది’ అని స్పష్టం చేసింది. ‘ఈ ప్రాంత భవిష్యత్ ఎలా ఉండాలో నిర్ణయించేది సాయుధ బలగాలు. అమెరికా సైనికులు యుద్ధాన్ని ముగించలేరు. మేము పూర్తి శక్తితో యుద్ధం చేస్తున్నాం. మాపై ఆధిపత్యం ప్రదర్శించామని ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారు’ అని మండిపడింది.