News October 13, 2024
సీఐడీ చేతికి మరో 2 కేసులు అప్పగింత

AP: మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, చంద్రబాబు నివాసంపై దాడి కేసును సీఐడీకి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ కేసులు మంగళగిరి, తాడేపల్లి పీఎస్‌ల పరిధిలో ఉన్నాయి. విచారణ వేగవంతం కోసం ఈ నిర్ణయం తీసుకోగా, ఆయా ఫైళ్లను సీఐడీకి మంగళగిరి డీఎస్పీ రేపు అప్పగించనున్నారు.
Similar News
News November 2, 2025
పంకజ్ త్రిపాఠి తల్లి కన్నుమూత

బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి హేమ్వంతి దేవి(89) అనారోగ్యంతో రెండు రోజుల కిందట మరణించారు. బిహార్‌లోని స్వస్థలం గోపాల్‌గంజ్‌లో నిన్న అంత్యక్రియలు కూడా పూర్తయినట్లు నటుడి టీమ్ ఇవాళ ప్రకటించింది. త్రిపాఠి తండ్రి బెనారస్ తివారీ(99) రెండేళ్ల క్రితం చనిపోయారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ ద్వారా పంకజ్ తెలుగు వారికీ దగ్గరైన విషయం తెలిసిందే.
News November 2, 2025
తుఫాను: రైతులను పరామర్శించనున్న జగన్

AP: మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను తమ అధినేత జగన్ పరామర్శిస్తారని వైసీపీ తెలిపింది. ఈ నెల 4న కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరులో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారని పేర్కొంది. కాగా జగన్ ఇవాళ బెంగళూరు నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వచ్చారు.
News November 2, 2025
సచిన్‌తో లోకేశ్, బ్రాహ్మణి సెల్ఫీ

ICC ఛైర్మన్ జైషాతో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. తన భార్య బ్రాహ్మణితో పాటు వెళ్లి జైషా, ఆయన తల్లి సోనాలీ షాను కలిసినట్లు ట్వీట్ చేశారు. క్రికెట్, యువత భాగస్వామ్యం, దేశ క్రీడా భవిష్యత్తు గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. నవీముంబైలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు లోకేశ్, బ్రాహ్మణి వెళ్లారు. టీమ్ఇండియా జెర్సీలు ధరించిన వారిద్దరూ సచిన్‌తో పాటు పలువురిని కలిశారు.


