News October 4, 2024

తెలంగాణలో మరో 2 IIITలు?

image

TG: బాసరలోని RGUKTకి అనుబంధంగా మరో రెండు IIITలను ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఒకటి ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో, మరొకటి ఖమ్మం లేదా నల్గొండ జిల్లాలో ఏర్పాటుచేయొచ్చని సమాచారం. ఒక్కోదానికి 100 ఎకరాల భూమి, రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇంజినీరింగ్‌తోపాటు మల్టీ డిసిప్లినరీ కోర్సులు ప్రవేశపెట్టనున్నారు.

Similar News

News November 24, 2025

బీజేపీతో పొత్తు.. కొట్టిపారేసిన ఒవైసీ

image

‘బీజేపీతో మజ్లిస్ పొత్తు’ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా వర్గాలు వక్రీకరించి తప్పుదోవ పట్టించాయన్నారు. ‘ఏ కూటమిలో చేరే ఆలోచన లేదు. బీజేపీ భాగస్వామ్యం ఉన్న ఏ సర్కారుకూ మద్దతివ్వం. అయితే సీమాంచల్‌(బిహార్)అభివృద్ధికి నితీశ్ ప్రభుత్వం కృషి చేస్తే సహకరిస్తాం’ అని స్పష్టం చేశారు. తమ పోరాటం ప్రజల హక్కుల కోసమేనని తేల్చి చెప్పారు.

News November 24, 2025

గులాబీలో చీడలను ఎలా నివారించవచ్చు?

image

చీడలు ఆశించిన గులాబీ రెమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. చీడల నివారణకు లీటరు నీటికి 2.5ml క్లోరిపైరిఫాస్, 2ml ప్రొఫినోపాస్ పురుగు మందుల్లో ఒకదానిని.. 3గ్రా బ్లైటాక్స్, 2గ్రా కవచ్‌ మందుల్లో ఒకదానికి కలిపి స్ప్రే చేయాలి. అవసరం బట్టి 2 వారాల వ్యవధిలో మందులు మార్చి స్ప్రే చేయాలి. పువ్వుల నాణ్యత కోసం లీటరు నీటికి 5 గ్రా. మల్టీ-K (13-0-45), 2 గ్రా ఫార్ములా-4ను 15 రోజుల వ్యవధిలో 2,3 సార్లు స్ప్రే చేయాలి.

News November 24, 2025

హైకమాండ్ కోరుకుంటే సీఎంగా కొనసాగుతా: సిద్దరామయ్య

image

కాంగ్రెస్ హైకమాండ్ కోరుకుంటే తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. మార్పులు ఏవైనా కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయని చెప్పారు. వారు ఏం చెప్పినా తాను, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అంగీకరించాల్సిందేనని తెలిపారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు 4-5 నెలల కిందటే హైకమాండ్ ఒప్పుకుందని, అయితే 2.5 ఏళ్ల టర్మ్ పూర్తయ్యేదాకా ఆగాలని చెప్పిందని పేర్కొన్నారు.