News August 29, 2025

సికింద్రాబాద్-వాడి మధ్య మరో 2 ట్రాకులు

image

TG: రాష్ట్రంలో తొలి 4లైన్ల అంతర్రాష్ట్ర రైలుమార్గం రూపుదిద్దుకోనుంది. రూ.5,012 కోట్లతో సికింద్రాబాద్(సనత్‌నగర్)-వాడి మధ్య 3, 4వ లైన్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు 2026 కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారు. డబుల్ ట్రాక్‌గా ఉన్న ఈ రూటును 4 లైన్లుగా మార్చనున్నారు. వచ్చే ఐదేళ్లలో పనులు పూర్తి చేయనున్నారు. తాజా నిర్ణయంతో ఈ రూట్లో కొత్త రైళ్లు వచ్చే అవకాశముంది.

Similar News

News August 29, 2025

స్టార్ హీరో విశాల్ నిశ్చితార్థం

image

తన ప్రియురాలు, హీరోయిన్ సాయి ధన్షికతో నిశ్చితార్థం జరిగినట్లు తమిళ స్టార్ హీరో విశాల్ వెల్లడించారు. ‘నా పుట్టిన రోజు సందర్భంగా నన్ను ఆశీర్వదిస్తూ విషెస్ తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజునే కుటుంబసభ్యులు, బంధువుల మధ్య సాయి ధన్షికతో నాకు నిశ్చితార్థం జరిగింది. ఎప్పటిలాగే మీ అందరి ఆశీర్వాదాలు మాపై ఉండాలని కోరుకుంటున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. వేడుక ఫొటోలను పంచుకున్నారు.

News August 29, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 పెరిగి రూ.1,03,310కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.650 ఎగబాకి రూ.94,700 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,29,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News August 29, 2025

పిన్నెల్లి సోదరులకు ఎదురుదెబ్బ

image

AP: టీడీపీ నేతల జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న YCP మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. వీరికి నేర చరిత్ర ఉందని, బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తారన్న ప్రభుత్వ న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది. కాగా మాచర్ల నియోజకవర్గం ముదిలవీడు సమీపంలో జరిగిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్యలకు వీరు కుట్ర పన్నారని కేసు నమోదైంది.