News December 20, 2024

కొత్తగా 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలు: శ్రీధర్ బాబు

image

TG: ప్రస్తుతం మున్సిపాలిటీలుగా ఉన్న మహబూబ్‌నగర్, మంచిర్యాలను కార్పొరేషన్లుగా మారుస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రకటించారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేస్తున్నామన్నారు. అటు కోహీర్, గుమ్మడిదల, గడ్డపోతారం, ఇస్నాపూర్, చేవెళ్ల, మొయినాబాద్, మద్దూర్, దేవరకద్ర, కేసముద్రం, స్టేషన్ ఘన్‌పూర్, అశ్వారావుపేట, ఏదులాపురం పంచాయతీలను మున్సిపాలిటీలుగా మారుస్తున్నామన్నారు.

Similar News

News October 21, 2025

మీ నిస్వార్థ సేవకు సలామ్!❤️

image

దీపావళికి లక్ష్మీ పూజకు ఏర్పాట్లు చేస్తోన్న ఓ మహిళా డాక్టర్‌కు ‘ఎమర్జెన్సీ’ అని ఫోన్ వచ్చింది. మిగతా డాక్టర్లు సెలవులో ఉండటంతో ఆమె పూజను వదిలి తన బాధ్యతకు ప్రాధాన్యతనిచ్చారు. పిండంలో కదలికలు లేకపోవడంతో ఆందోళనలో ఉన్న ఓ గర్భిణికి ఆపరేషన్ చేసి బిడ్డను కాపాడారు. తన ఇంట్లో లక్ష్మిని వదిలి వచ్చినా.. మరో ఇంటి లక్ష్మీదేవికి ప్రాణం పోశానంటూ ఆమె ట్వీట్ చేశారు. నిస్వార్థంగా సేవచేసే వైద్యులకు సలామ్!

News October 21, 2025

వంటింటి చిట్కాలు

image

* ఫ్రిడ్జ్‌లో బాగా వాసన వస్తుంటే ఒక చిన్న కప్పులో బేకింగ్ సోడా వేసి ఒక మూలన పెడితే వాటన్నిటినీ పీల్చుకుంటుంది.
* బంగాళదుంప ముక్కలను పదినిమిషాలు మజ్జిగలో నానబెట్టి, తర్వాత ఫ్రై చేస్తే ముక్కలు అతుక్కోకుండా వస్తాయి.
* దోశలు కరకరలాడుతూ రావాలంటే మినప్పప్పు నానబెట్టేటపుడు, గుప్పెడు కందిపప్పు, స్పూను మెంతులు, అటుకులు వేయాలి.
* కందిపప్పు పాడవకుండా ఉండాలంటే ఎండుకొబ్బరి చిప్పను ఆ డబ్బాలో ఉంచాలి.

News October 21, 2025

దానధర్మాలు చేస్తే మోక్షం లభిస్తుందా?

image

దానం చేసేటప్పుడు ‘నాకు పుణ్యం దక్కాలి’ అని ఆశించకూడదు. ‘నేను దానం చేశాను’ అనే అహంకారం ఉండకూడదు. లేకపోతే ఆ దానం చేసినందుకు పుణ్యం లభించదని పండితులు చెబుతున్నారు. ‘దానం చేయడం ద్వారా మనసు శుభ్రపడుతుంది. చిత్త శుద్ధి పెరుగుతుంది. ఈ శుభ్రమైన మనసుతోనే మనం జ్ఞానాన్ని పొందగలం. ఈ జ్ఞానమే మనకు జనన మరణాల నుంచి విముక్తిని కలిగిస్తుంది. ఫలితంగా మోక్షం లభిస్తుంది. దానం మాత్రమే మోక్షాన్ని ఇవ్వదు’ అంటున్నారు.