News January 4, 2025
SBI నుంచి 2 కొత్త డిపాజిట్ స్కీమ్‌లు

SBI రెండు కొత్త డిపాజిట్ పథకాలను ప్రారంభించింది. హర్ ఘర్ లఖ్పతీ స్కీమ్‌లో రూ.లక్ష చొప్పున(రూ.లక్ష మల్టిపుల్స్) పోగేసుకోవచ్చని SBI తెలిపింది. ఈ ప్రీకాలిక్యులేటెడ్ రికరింగ్ డిపాజిట్ కనీస కాలవ్యవధి 12నెలలు కాగా, గరిష్ఠ వ్యవధి 120 నెలలు. అటు, 80ఏళ్ల పైబడిన వారి కోసం తీసుకొచ్చిన SBI ప్యాట్రన్స్ స్కీమ్‌లో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వడ్డీ కంటే 10బేస్ పాయింట్లు అదనంగా చెల్లించనున్నట్లు వెల్లడించింది.
Similar News
News December 6, 2025
సూర్యాపేట: ఎన్నికల ఫిర్యాదులకు ఐఏఎస్ అధికారి ప్రత్యేక నంబర్

గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా సాధారణ పరిశీలకులు, ఐఏఎస్ అధికారి రవి నాయక్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన కోరారు. ఎన్నికల ఉల్లంఘనలు లేదా ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావడానికి ఆయన ఒక ప్రత్యేక ఫోన్ నంబర్‌ను ప్రకటించారు. 9676845846 జిల్లాలో ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News December 6, 2025
గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ

AP: విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తోన్న కృషిని CM వివరించినట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని నిర్మాణ పనుల పురోగతిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
News December 6, 2025
హిట్ మ్యాన్@ 20,000 రన్స్

SAతో మూడో వన్డేలో రోహిత్ శర్మ కీలక మైలురాయిని చేరుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్(టెస్టు, వన్డే, T20)లో 20,000 పరుగులు చేసిన నాలుగో ఇండియన్ ప్లేయర్‌గా నిలిచారు. కేశవ్ వేసిన 14 ఓవర్ నాలుగో బంతికి సింగిల్ తీసి ఈ ఘనత సాధించారు. సచిన్(34,357), కోహ్లీ(27,910), ద్రవిడ్(24,064) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా ప్రస్తుత మ్యాచ్‌లో భారత్ నిలకడగా ఆడుతోంది. క్రీజులో జైస్వాల్(38), రోహిత్(50) ఉన్నారు.


