News April 24, 2024
ఈ వారం ఓటీటీలోకి 2 కొత్త సినిమాలు

ఈవారం రెండు తెలుగు సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను అలరించనున్నాయి. సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ నటించిన ‘టిల్లు స్క్వేర్’ ఏప్రిల్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే గోపీచంద్ నటించిన ‘భీమా’ ఏప్రిల్ 25న నుంచి హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. ఇక 26న క్రాక్(హిందీ), థాంక్యూ, గుడ్‌నైట్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.
Similar News
News March 26, 2026
67,583 ఉద్యోగాలు భర్తీ చేశాం: డిప్యూటీ సీఎం భట్టి

TG: రాష్ట్రంలో ఇప్పటివరకు 67,583 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని 31,798 పోస్టులకు నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. తమ హయాంలో 16,798 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపట్టామని.. ఇక గత ప్రభుత్వ హయాంలో నోటిఫై అయ్యి పెండింగ్ ఉన్న 50,785 పోస్టింగ్స్ కూడా పూర్తి చేశామన్నారు. నిన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ వివరాలు వెల్లడించారు.
News March 26, 2026
ముంబై ఇండియన్స్.. ప్లేయింగ్-11 ఇదేనా?

IPL-2026లో ముంబై స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. రోహిత్, సూర్య, పాండ్య లాంటి స్టార్లు ఆ జట్టు సొంతం. బుమ్రా, బౌల్ట్‌లతో పేస్ దళం కూడా బలంగానే ఉంది. అయితే స్పిన్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది.
ప్లేయింగ్ 11 అంచనా: రోహిత్ శర్మ, డికాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (C), నమన్ ధీర్, రూథర్‌ఫర్డ్, శాంట్నర్, శార్దుల్/దీపక్ చాహర్, బుమ్రా, అశ్వని/మయాంక్ మార్కండే, బౌల్ట్.
News March 26, 2026
మరో డేంజర్.. ముదరనున్న చమురు సంక్షోభం?

ఖర్గ్ <<19478356>>ద్వీపం<<>> స్వాధీనానికి US ప్లాన్ చేస్తే యెమన్ సమీపాన ఉండే బాబ్ ఎల్-మండేబ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. సరకు రవాణాకు ఇది ఎంతో కీలకం. ఇది మూతబడితే ఆఫ్రికా <<19394249>>చుట్టూ<<>> తిరిగి ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ట్రంప్ చర్యలతో చమురు సంక్షోభం ముదిరేలా ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా ఇటీవల యెమెన్ మిలిటెంట్ గ్రూప్ హౌతీ ఇరాన్‌కు మద్దతు తెలిపింది.


