News June 6, 2024
TDP చరిత్రలో గెలవలేకపోయిన 2 స్థానాలు

AP: ఈసారి TDP ఎలక్షన్ వార్‌ను వన్‌సైడ్ చేసింది. అయితే చరిత్రలో గెలవలేకపోయిన 2 స్థానాల్లో(పులివెందుల, యర్రగొండపాలెం) ఈసారీ గెలవలేకపోయింది. పులివెందులలో 1978 నుంచి YS కుటుంబం గెలుస్తూ వస్తోంది. అక్కడ ప్రస్తుతం YS జగన్, ప్రకాశం(D) యర్రగొండపాలెంలో చంద్రశేఖర్(YCP) గెలిచారు. ఇది 1972లో నియోజకవర్గంగా రద్దయి 2009లో ఉనికిలోకి వచ్చింది. కాగా డీలిమిటేషన్‌తో ఏర్పడ్డ 6 స్థానాల్లో TDP ఈసారి బోణీ కొట్టింది.
Similar News
News November 19, 2025
అన్నదాత సుఖీభవ రెండో విడత.. రూ.3,135 కోట్లు జమ

AP: పీఎం కిసాన్ -అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కడప జిల్లా పెండ్లిమర్రిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి అర్హులైన 46,85,838 రైతుల అకౌంట్లలో రూ.3,135 కోట్లను జమ చేశారు. PM కిసాన్ కింద రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ రెండో విడత కింద రూ.5వేలు మొత్తం రూ.7వేలు చొప్పున రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి.
News November 19, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 9

50. జ్ఞానం అంటే ఏమిటి? (జ.మంచి చెడ్డల్ని గుర్తించగలగడం)
51. దయ అంటే ఏమిటి? (జ.ప్రాణులన్నింటి సుఖం కోరడం)
52. అర్జవం అంటే ఏమిటి? (జ.సదా సమభావం కలిగి ఉండడం)
53. సోమరితనం అంటే ఏమిటి? (జ.ధర్మకార్యములు చేయకుండుట)
54. దు:ఖం అంటే ఏమిటి? (జ.అజ్ఞానం కలిగి ఉండటం)
55. ధైర్యం అంటే ఏమిటి? (జ.ఇంద్రియ నిగ్రహం)
<<-se>>#YakshaPrashnalu<<>>
News November 19, 2025
PM కిసాన్ 21వ విడత.. రూ.18 వేల కోట్లు జమ

దేశ వ్యాప్తంగా అన్నదాతలకు రబీ పెట్టుబడి సాయం కింద PM కిసాన్ 21వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన కార్యక్రమంలో.. దేశ వ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున రూ.18వేల కోట్లను ప్రధాని జమ చేశారు. ఇప్పటి వరకు PM కిసాన్ 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను అన్నదాతల అకౌంట్లలో కేంద్రం జమ చేసింది.


