News August 27, 2024
2 షోరూంలు.. 8 మంది ఉద్యోగులు.. ఐపీవోలో రూ.4 వేల కోట్లకు బిడ్లు

దలాల్ స్ట్రీట్ షాక్‌కు గురైంది. కేవలం రెండంటే రెండు షోరూమ్‌లు, 8 మంది ఉద్యోగులు ఉన్న యమహా టూవీలర్ డీలర్షిప్ సంస్థ రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ ఐపీవోకు అనూహ్య స్పందన లభించింది. రూ.12 కోట్ల IPOకు సుమారు రూ 4,800 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. ఇంత చిన్న సంస్థ 400 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అవ్వడంతో దలాల్ స్ట్రీట్ అయోమయంలో పడిపోయింది. 10.2 లక్షల షేర్లను రూ.117 స్థిర ధరతో సంస్థ ఆఫర్ చేసింది.
Similar News
News January 26, 2026
పనిమనిషిపై పదేళ్లుగా రేప్.. ధురంధర్ నటుడి అరెస్ట్

బాలీవుడ్ యాక్టర్ నదీమ్ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై 10సం.లుగా రేప్‌కు పాల్పడ్డారని అతడి ఇంటి పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక, మానసిక వేధింపులకు గురైనా పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఇంతకాలం బయటకు చెప్పలేదని పేర్కొంది. దీంతో పోలీసులు నటుడిని అదుపులోకి తీసుకున్నారు. మిమి, వాధ్, మై లడేగా తదితర మూవీల్లో నటించిన అతడు ‘ధురంధర్’లో అక్షయ్ ఖన్నా వంటమనిషి అఖ్లాక్‌గా నటించారు.
News January 26, 2026
క్లీనింగ్ టిప్స్

* పాత లెదర్ వస్తువులకు మెరుపు రావాలంటే కొద్దిగా వ్యాజలీన్ రాసి, మెత్తని వస్త్రంతో తుడవండి. * బాత్రూం అద్దాలపై సబ్బు నీళ్ళ మరకలు పడితే, వెనిగర్‌లో ముంచిన స్పాంజితో రుద్ది చూడండి. * చెక్క వస్తువులపై గీతలు పడితే వెనిగర్, వంట నూనె మిశ్రమంలో ముంచి తీసిన వస్త్రంతో తుడిస్తే మరకలు పోతాయి. * ఖరీదైన దుస్తులపై ఇంకు మరకలు పడితే కొద్దిగా బేకింగ్ సోడాతో రుద్ది, వెనిగర్‌లో ముంచి ఉతికితే త్వరగా పోతాయి.
News January 26, 2026
ఎగ్జిమ్ బ్యాంక్‌లో డిప్యూటీ మేనేజర్ పోస్టులు

<


