News June 20, 2024

వాయు కాలుష్యంతో రోజుకు 2వేల మంది చిన్నారులు మృతి: రిపోర్ట్

image

ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య సంబంధిత అనారోగ్య సమస్యలతో రోజుకు 2వేల మంది చిన్నారులు మరణిస్తున్నారని యూఎస్‌-హెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూట్ నివేదిక పేర్కొంది. 2021లో వాయు కాలుష్యంతో 81 లక్షల మంది మరణించినట్లు తెలిపింది. రక్తపోటు తర్వాత వాయుకాలుష్యమే మరణాలకు రెండో ప్రధాన కారకంగా ఉందని వెల్లడించింది. దీనిని నియంత్రించకపోతే తదుపరి జనరేషన్‌పై ప్రభావం చూపే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది.

Similar News

News April 11, 2026

వామ్మో నిమ్మ.. భారీగా పెరిగిన ధర

image

AP: ఉష్ణోగ్రతలు పెరగడంతో నిమ్మ కాయల ధరలకు రెక్కలొచ్చాయి. <<19560961>>జనవరిలో కేజీ రూ.10<<>>, మూడు వారాల కిందట కేజీ రూ.30గా ఉన్న ధర ఇప్పుడు రూ.130-135కి చేరింది. రేట్లు పెరిగినా వాతావరణ మార్పులతో దిగుబడి తీవ్రంగా తగ్గిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గతంలో ఎకరాకు 40 బస్తాలు వచ్చేదని, ఇప్పుడు 15 బస్తాలు కూడా రావడం లేదంటున్నారు. మరోవైపు పెరిగిన ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.

News April 11, 2026

IPL: SRH బ్యాటింగ్

image

న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్‌ వేదికగా SRHతో మ్యాచులో పంజాబ్‌ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
SRH: హెడ్, అభిషేక్, ఇషాన్, క్లాసెన్, సలీల్, అనికేత్, నితీశ్, హర్ష్ దూబే, శివంగ్, హర్షల్, ఎషాన్ మలింగ
* ప్రఫుల్ హింగే(డెబ్యూ) IMPACT
PBKS: ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్, కూపర్, శ్రేయస్, శశాంక్, స్టొయినిస్, యాన్సెన్, బార్ట్‌లెట్, వైశాక్, అర్ష్‌దీప్, చాహల్

News April 11, 2026

39 యుద్ధ విమానాలను కోల్పోయిన US

image

ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా భారీగా నష్టపోయినట్లు ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. 39 రోజులపాటు కొనసాగిన ‘ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ’లో దాదాపు 39 ఫైటర్ జెట్స్, ఎయిర్‌క్రాఫ్ట్‌లను కోల్పోయినట్లు తెలిపింది. వీటిలో MQ-9 రీపర్ డ్రోన్స్, యూఎస్ నేవీ MQ-4C, F-15E, A-10, F-35A విమానాలున్నట్లు పేర్కొంది. మెజారిటీ జెట్స్ ఇరాన్ ప్రతిదాడుల్లో, మరికొన్ని ఫ్రెండ్లీ ఫైరింగ్‌లో కూలినట్లు సమాచారం.