News June 7, 2024
కేంద్రంలో టీడీపీకి 2 నుంచి 4 పదవులు?

AP: కేంద్ర కేబినెట్లో చేరనున్న TDPకి 2 కేబినెట్ పదవులు, మరో 2 సహాయమంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. ఈ నెల 9న మోదీతో పాటే TDP MPలూ ప్రమాణం చేసే ఛాన్సుంది. TDP నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు(శ్రీకాకుళం), హరీశ్ మాధుర్(అమలాపురం), కృష్ణప్రసాద్(బాపట్ల), ప్రసాదరావు(చిత్తూరు), పెమ్మసాని చంద్రశేఖర్(గుంటూరు), వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(నెల్లూరు), బైరెడ్డి శబరి(నంద్యాల) పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
Similar News
News December 20, 2025
జూన్ కల్లా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తాం: సీఎం

AP: జనవరి 26 నాటికి రోడ్లపై చెత్త కనిపించకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జూన్ కల్లా APని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రకటించారు. ప్రజల్లోనూ సామాజిక స్పృహ రావాలని, ఇంట్లోని చెత్తను రోడ్లపై వేయొద్దని సూచించారు. అనకాపల్లి(D) తాళ్లపాలెంలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’లో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో 10L గృహాలు, పట్టణాల్లో 5L ఇళ్లలో కంపోస్టు తయారీ తమ లక్ష్యమన్నారు.
News December 20, 2025
కర్ణాటక CM మార్పు.. సరైన టైంలో హైకమాండ్ని కలుస్తామన్న DK

కర్ణాటకలో CM మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా Dy CM డీకే శివకుమార్ మాట్లాడుతూ.. పిలుపు వచ్చినపుడు తాను, సీఎం సిద్దరామయ్య హైకమాండ్ని కలుస్తామన్నారు. సరైన సమయంలో పిలుస్తామని పార్టీ పెద్దలు చెప్పినట్లు తెలిపారు. పవర్ షేరింగ్ ఒప్పందమేమీ లేదని.. హైకమాండ్ చెప్పే వరకు తానే సీఎం అని సిద్దరామయ్య శుక్రవారం అనడంతో చర్చ మళ్లీ మొదలైంది. ఈ నేపథ్యంలోనే డీకే తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
News December 20, 2025
BEML 50 పోస్టులకు నోటిఫికేషన్

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<


