News April 15, 2025
20న పెళ్లి.. ఇష్టం లేక యువతి ఆత్మహత్య

పెళ్లికూతరు కావాల్సిన యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాప్తాడు మండలంలో జరిగింది. పూలకుంట గ్రామానికి చెందిన రేణుక(24) ఆకుతోటపల్లి-1 సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు కళ్యాణదుర్గానికి చెందిన యువకుడితో ఈ నెల 20న వివాహం జరగాల్సి ఉంది. ఇంట్లో సందడి మొదలవగా యువతికి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
Similar News
News February 24, 2026
నాగర్‌కర్నూల్: ఇంటర్ పరీక్షల దృష్ట్యా ఎస్పీ కీలక ఆదేశాలు

జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఎస్పీ సంగ్రామ్ జి పాటిల్ కీలక సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని, డీజేలు, లౌడ్ స్పీకర్ల వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. పరీక్షల నిర్వహణ దృష్ట్యా జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
News February 24, 2026
వనపర్తి: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

వనపర్తి జిల్లాలో ఇంటర్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DIEO ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లావ్యాప్తంగా 25 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా నిఘా ఉంచామని పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం 633 మంది ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించినట్లు మంగళవారం వెల్లడించారు.
News February 24, 2026
ఒకరోజు ముందే పెన్షన్లు

AP: రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందే పెన్షన్లను పంపిణీ చేయనుంది. మార్చి 1న ఆదివారం ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ఉండటంతో ఈనెల 28న అందజేయాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. పింఛన్ల పంపిణీ నేపథ్యంలో ఆ రోజున అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని CM చంద్రబాబు నిర్ణయించారు. పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టంచేశారు. మరోవైపు 28న పెన్షన్లు అందుకోని వారికి మార్చి 2న ఇవ్వనున్నారు.


