News February 3, 2025
20న విడుదల కానున్న TS- EAPCET నోటిఫికేషన్

JNTU వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న TS- EAPCET 2025 పరీక్షకు సంబంధించి ఉన్నతాధికారులు నేడు మొట్టమొదటి సెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 20వ తేదీన నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 29, 30వ తేదీన ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాలతో పాటు మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ పరీక్షలను నిర్వహించనున్నారు.
Similar News
News November 20, 2025
పోలి పాడ్యమి కథ అందిస్తున్న సందేశాలివే..

☞ భగవంతుడికి కావాల్సింది ఆడంబరం కాదు, పోలి వలె నిజాయితీ, తపనతో కూడిన శ్రద్ధ మాత్రమే.
☞ అహంకారం పతనానికి దారి తీస్తుందని అత్తగారి ఉదంతం హెచ్చరిస్తుంది. అహంకారంతో చేసే పూజలు నిష్ప్రయోజనం.
☞ సంకల్ప శక్తి ముఖ్యం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ధర్మాన్ని పాటించాలనే మనసు ఉంటే మార్గం దానంతట అదే దొరుకుతుంది.
☞ కుటుంబ సఖ్యత కోసం అసూయ, కంటగింపులను విడిచిపెట్టాలని ఈ కథ బోధిస్తుంది.
News November 20, 2025
అదును తప్పిన పైరు.. ముదిమిలో బిడ్డలు ఒక్కటే

ఏ పంటకైనా అదును(అనుకూల సమయం) ముఖ్యం. సరైన సమయానికి విత్తనం వేయకపోతే పంట సరిగా రాదు, దాని వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే ముసలి వయసులో పిల్లలు పుడితే, వారు తల్లిదండ్రులకు అండగా నిలబడలేరు లేదా వారికి సేవ చేయలేరు. ఈ రెండూ సమయానికి చేయని పనులు లేదా నిష్ప్రయోజనమైన పరిస్థితులను తెలియజేస్తాయి.
News November 20, 2025
హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా బుధవారం రాత్రి వరకు హిడ్మా, అతని భార్య రాజేతోపాటు మరో మావోయిస్టు మృతదేహానికి మాత్రమే రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. మరో ముగ్గురి మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు వేచి చూస్తున్నారు.


