News February 3, 2025

20న విడుదల కానున్న TS- EAPCET నోటిఫికేషన్

image

JNTU వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న TS- EAPCET 2025 పరీక్షకు సంబంధించి ఉన్నతాధికారులు నేడు మొట్టమొదటి సెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 20వ తేదీన నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 29, 30వ తేదీన ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాలతో పాటు మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ పరీక్షలను నిర్వహించనున్నారు.

Similar News

News February 14, 2025

పెద్దగట్టు జాతరకు 60 స్పెషల్ బస్సులు..

image

తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర అయిన సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి గ్రామంలో జరిగే లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు సూర్యాపేట డిపో నుంచి 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా RM కే.జానిరెడ్డి తెలిపారు. పెద్దగట్టు జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిపారు. ఈ సదుపాయాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News February 14, 2025

వరంగల్ ఎంజీఎంలో పోలీసుల తనిఖీలు

image

విజిబుల్ పోలీసింగ్‌తో పాటు నేరాల నియంత్రణలో భాగంగా మట్టెవాడ పోలీసులు శుక్రవారం సాయంత్రం ఎంజీఎంలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆస్పత్రి పరిసరాల్లో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను, బ్యాగులను తనిఖీ చేయడంతో పాటు వారి వివరాలను నమోదు చేశారు. ఈ తనిఖీల్లో మట్టెవాడ ఎస్ఐ విఠల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

News February 14, 2025

స్కూలు విద్యార్థులకు శుభవార్త

image

AP: BC విద్యార్థుల ₹110.52 కోట్ల డైట్ బకాయిలు, ₹29 కోట్ల కాస్మోటిక్ బిల్లులు చెల్లించాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ₹13.10 కోట్లతో 660 హాస్టళ్లలో చేపట్టిన మరమ్మతులు 6 వారాల్లో పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, కిచెన్ ఐటెమ్స్ అందించాలని సూచించారు. నసనకోట, ఆత్మకూరు BC సంక్షేమ బాలికల పాఠశాలలను రెసిడెన్షియల్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని చెప్పారు.

error: Content is protected !!