News August 18, 2024
20వ తేదీ నుంచి ఆధార్ క్యాంపులు: కలెక్టర్
కర్నూలు: ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు ఆధార్ క్యాంపులను సచివాలయాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ కార్డు కొత్తగా నమోదుతో పాటు అప్డేట్, బయోమెట్రిక్ చేసుకునేందుకు అవకాశం కల్పించామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Similar News
News September 11, 2024
ఎమ్మెల్యే 3 నెలల వేతనం విరాళం
సీఎం సహాయ నిధికి తన 3 నెలల వేతనం రూ.5 లక్షలు, గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు టీడీపీ నాయకులు ఇచ్చిన మరో రూ.5 లక్షల విరాళంతో కలిపి మొత్తం రూ.10 లక్షలు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి సీఎం చంద్రబాబుకు అందజేశారు. అనంతరం విజయవాడలో వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తనకు కేటాయించిన వార్డులో పర్యటించి, వారి కష్టాలు తెలుసుకున్నారు.
News September 11, 2024
దాతలు ముందుకు రావడం అభినందనీయం: మంత్రి భరత్
వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని మంత్రి టీజీ భరత్ అన్నారు. అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ వరద బాధితులను ఆదుకునేందుకు రూ.25 లక్షలు అందించింది. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో కంపెనీ ప్రతినిధులు భరత్‌ను కలిసి చెక్కును అందించారు. మంత్రి మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తుందని చెప్పారు.
News September 11, 2024
కర్నూలు: మాజీ మంత్రి కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు
అసభ్య పదజాలంతో దూషించిన మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ లీగల్ సెల్ ఆలూరు నియోజకవర్గ కన్వీనర్ ప్రవీణ్ కుమార్, టీడీపీ నాయకుడు వెంకటేశ్ చౌదరి మంగళవారం ఆలూరు సీఐ శ్రీనివాస్ నాయక్‌కు ఫిర్యాదు చేశారు. విజయవాడ వరద బాధితులకు మంచి చేస్తున్న సీఎంపై లోఫర్ అంటూ అసభ్య పదజాలంతో దూషించడం మాధ్యమాల్లో చూశామన్నారు. నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.