News November 6, 2024

20వ వార్షిక మహాసభలో కలెక్టర్ వినోద్ కుమార్

image

అనంతపురం రూరల్ పరిధిలోని పంగల్ రోడ్ లో ఉన్న టీటీడీసీ కేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రశాంతి జిల్లా పరస్పర సహాయ సహకార సంఘాల ఫెడరేషన్ లిమిటెడ్ 20వ వార్షిక మహాసభలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సంఘాల అభివృద్ధి చెందాలంటే అధికారులకు, పాలకవర్గాల మధ్య సంబంధం దగ్గరగా ఉండాలని, అందరూ కలిసి పనిచేసే సంస్థ అభివృద్ధి వైపు తీసుకోరావాలని కోరారు.

Similar News

News November 7, 2024

ఇన్సూరెన్స్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి ఉద్యాన పంటల పరంగా టమోటా పంటను పంటల బీమా పథకంలో గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. జిల్లాలో టమోటా పంటను బీమా చేసే సదుపాయం IFFCO-TOKIO అనే కంపెనీకి ఇవ్వడం జరిగిందని, ఒక ఎకరాకి కంపెనీ వారు రూ.32,000 వరకు పంటను బీమా చేస్తారన్నారు. దీనికి రైతు 10శాతం బీమా ప్రీమియం చెల్లించాలన్నారు.

News November 6, 2024

గ్రామసభల ద్వారా భూ సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని భూ సమస్యలను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులను ఆదేశించారు. వారంలో నాలుగు రోజులు గ్రామ సభల ద్వారా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం మినహా మిగిలిన రోజులు పంచాయితీ లేదా రెవెన్యూ గ్రామసభలను నిర్వహించాలన్నారు.

News November 6, 2024

రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి

image

ధర్మవరం నుంచి పెనుకొండకు వస్తున్న పీఈటీ రమేశ్ కూతురు సాయి భవిత(15) బుధవారం రోడ్డు ప్రమాదంలో మరణించింది. తండ్రీకూతుళ్లిద్దరూ బైకులో వస్తుండగా.. గుట్టూరు సమీపంలో వెనకనుంచి బొలెరో ఢీకొట్టడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సాయి భవిత మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రమేశ్‌ను మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.