News April 17, 2024

20న నెల్లూరుకు చంద్రబాబు నాయుడు

image

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం సర్వేపల్లి నియోజకవర్గంలో, సాయంత్రం కందుకూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడి ప్రచార సభలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా టీడీపీ కార్యాలయానికి సమాచారం అందింది.

Similar News

News October 8, 2025

నెల్లూరులో మర్డర్స్.. పోలీసుల అదుపులో నిందితులు?

image

నెల్లూరు రంగనాయకుల గుడి వెనుక వైపు ఉన్న వారధి వద్ద డబుల్ మర్డర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు సమాచారం. ఎస్పీ డా.అజిత వెజెండ్ల, DSP సింధూ ప్రియ పర్యవేక్షణలో సంతపేట CI దశరథ రామారావు విచారణ చేపట్టారు. హత్య చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నేడే, రేపో నిందితుల వివరాలు బహిర్గతం చేస్తారని తెలుస్తోంది.

News October 8, 2025

నెల్లూరు: ‘మహిళలపై జరిగే నేరాల నివారణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి’

image

మహిళలపై జరిగే నేరాల నివారణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పోలీసులకు గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో DSP, ఆపై స్థాయి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలను ఆరా తీశారు. ప్రాపర్టీ, రౌడీ ఎలెమెంట్స్, గాంజా, మిస్సింగ్ కేసులు, పోక్సో వంటి కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

News October 7, 2025

నెల్లూరు: కేవలం 2 వేల మెట్రిక్ టన్నులే కొనుగోలు.!

image

జిల్లాలో ఎడగారు సీజన్‌కు ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే 40 శాతం కోతలు సైతం అయిపోయాయన్నారు. కేవలం 2 వేలు మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. దీన్ని బట్టి చూస్తే.. కోతలు దాదాపు పూర్తయ్యే దశలో PPC లను ఏర్పాటు చేయడంతో అన్నదాతలు బాగా నష్టపోయారు. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇవి ఉపయోగపడలేదని రైతన్నలు ఆరోపిస్తున్నారు.