News January 16, 2026
20న BJPకి కొత్త బాస్.. నితిన్ నబీన్ ఎన్నిక లాంఛనమే!

BJP నూతన జాతీయాధ్యక్షుడి ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. జనవరి 19న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా, అదే రోజు పత్రాల పరిశీలన, ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. అవసరమైతే 20న ఓటింగ్ నిర్వహించి కొత్త అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న నితిన్ నబీన్ ఒక్కరే నామినేషన్ వేసే అవకాశం ఉండటంతో ఆయన ఎన్నిక లాంఛనమే!
Similar News
News February 12, 2026
TG CET హాల్ టికెట్లు విడుదల

తెలంగాణ గురుకులం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG CET–2026) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. నేటి నుంచి ఈ నెల 22 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. 2026-27 అకడమిక్ ఇయర్‌కి సంబంధించి 5-9 తరగతుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించనున్నారు. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ <
News February 12, 2026
ఉత్తరంలో ఇల్లు కడితే కుబేరులు అవుతారా ?

ఉత్తరానికి అధిపతి కుబేరుడు. ఆ దిశలో ఇల్లు కడితే సంపన్నులవుతారని కొందరి అభిప్రాయం. అయితే ఇలా ఉత్తరదిశలో ఉన్న ఇంట్లో నివసిస్తున్న అందరూ కుబేరులవుతారనడం అపోహేనని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు స్పష్టం చేస్తున్నారు. ఈ వాస్తు నియమం పాటిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి సకల కార్యాలు పూర్తయ్యేలా దోహదం చేస్తుందని చెబుతున్నారు. సంపద పెరిగే అవకాశాలు మెరుగుపడుతాయే తప్ప సంపద పెరగదు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 12, 2026
లైఫ్‌లో ఎన్నిసార్లు ప్రేమలో పడతారు..?

జీవితంలో ఒక మనిషి సగటున 2సార్లు గాఢంగా ప్రేమిస్తారని కిన్సీ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. 18-99సం.ల మధ్య గల 10వేల మందిపై సర్వే చేయగా.. 14% అసలు పిచ్చి ప్రేమలో పడబోమని, 28% ఒకసారి, 30% రెండు సార్లు, 17% మూడుసార్లు, 11% 4లేదా అంతకంటే ఎక్కువ సార్లు లవ్‌లో మునిగి తేలుతామన్నారట. ప్రేమ, ఆకర్షణకు తేడా గుర్తించక ప్రతి ఫీలింగ్‌నూ లవ్ అనుకుని ఆ రిలేషన్ మొదట్లో పొరబడతారట. ఈ సర్వేలో మీది ఏ బ్యాచ్? కామెంట్.


