News November 6, 2024
20వ వార్షిక మహాసభలో కలెక్టర్ వినోద్ కుమార్
అనంతపురం రూరల్ పరిధిలోని పంగల్ రోడ్ లో ఉన్న టీటీడీసీ కేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రశాంతి జిల్లా పరస్పర సహాయ సహకార సంఘాల ఫెడరేషన్ లిమిటెడ్ 20వ వార్షిక మహాసభలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సంఘాల అభివృద్ధి చెందాలంటే అధికారులకు, పాలకవర్గాల మధ్య సంబంధం దగ్గరగా ఉండాలని, అందరూ కలిసి పనిచేసే సంస్థ అభివృద్ధి వైపు తీసుకోరావాలని కోరారు.
Similar News
News November 6, 2024
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
ధర్మవరం నుంచి పెనుకొండకు వస్తున్న పీఈటీ రమేశ్ కూతురు సాయి భవిత(15) బుధవారం రోడ్డు ప్రమాదంలో మరణించింది. తండ్రీకూతుళ్లిద్దరూ బైకులో వస్తుండగా.. గుట్టూరు సమీపంలో వెనకనుంచి బొలెరో ఢీకొట్టడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సాయి భవిత మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రమేశ్‌ను మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.
News November 6, 2024
టీటీడీ పాలక మండలి సభ్యుడిగా అవకాశం రావడం నా అదృష్టం: ఎమ్మెల్యే
వివక్ష, అణచివేతకు గురైన వర్గాల నుంచి వచ్చిన తనకు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు అని మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు అన్నారు. బుధవారం టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి సన్నిధిలో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమితులవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
News November 6, 2024
మద్దెలచెరువు సూరి హత్య కేసు నిందితుడికి బెయిల్
అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌కు బెయిల్ మంజూరైంది. సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కేసులో హైదరాబాద్ సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే సూరి హత్య కేసులో గతంలో జీవిత ఖైదు శిక్ష పడటంతో అతడు జైలులోనే ఉండనున్నాడు. 2011 జనవరి 4న భాను కిరణ్ చేతిలో సూరి హత్యకు గురైన విషయం తెలిసిందే. భాను కిరణ్ 12 ఏళ్లుగా చంచల్‌గూడ జైలులో ఉంటున్నాడు.