News October 19, 2024
20 లక్షల ఇళ్లు నిర్మించడమే లక్ష్యం: మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 గృహాలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా పేదలకు అందజేస్తామని తెలిపారు.
Similar News
News November 20, 2025
రేగళ్లపాడు సెక్రటరీని సస్పెండ్ చేసిన కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి శివమాధవరావు సస్పెండయ్యారు. సత్తుపల్లి(M) రేగళ్లపాడులో లబ్ధిదారులు ఎడుకొండలు, సీతకు బిల్లులు చెల్లించేందుకు కార్యదర్శి ఈ నెల 4న రూ. 10 వేలు డిమాండ్ చేశారు. బాధితులు టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయగా, హౌసింగ్ ఈఈ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. ఈఈ నివేదిక ఆధారంగా కలెక్టర్ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News November 20, 2025
ఖమ్మం: గంజాయి కేసు.. ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష

గంజాయి కేసులో పట్టుబడిన ఇద్దరు నిందితులకు ఖమ్మం మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె. ఉమాదేవి బుధవారం సంచలన తీర్పు చెప్పారు. ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తీర్పు అనంతరం ప్రాసిక్యూషన్కు సహకరించిన అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రత్యేకంగా అభినందించారు.
News November 20, 2025
ధాన్యం, పత్తి కొనుగోళ్లపై మంత్రి తుమ్మల సమీక్ష

ధాన్యం, పత్తి పంటల కొనుగోళ్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి సమీక్ష నిర్వహించారు. నాణ్యత పరిశీలించిన ధాన్యానికి రైస్ మిల్లుల వద్ద కోతలు విధించవద్దని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో పాటిస్తున్న విధానాన్నే పత్తి కొనుగోలుకు కూడా పాటించాలన్నారు. గ్రామాల్లోనే తేమ శాతం చూడాలని సూచించారు.


