News January 29, 2025
20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: జీసీసీ ఛైర్మన్

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర GCC ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం అనంతగిరిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిందని దుయ్యబట్టారు. దానికి భిన్నంగా నేడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
Similar News
News December 12, 2025
చిత్తూరు: 2.22 లక్షల మందికి పోలియో చుక్కలు

ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు వేసేలా అధికారులు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని చిత్తూరు డీఆర్వో మోహన్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయంలో పల్స్ పోలియో సమావేశం శుక్రవారం నిర్వహించారు. డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలో 2.22 లక్షల మంది చిన్నారులు ఉన్నారని, వీరికి 142 రూట్లలో 5,794 బూత్ల పరిధిలో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు.
News December 12, 2025
తిరుపతి SVU ఫలితాల విడుదల

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది LLM1, 3 MSc బయో కెమిస్ట్రీ, MSc జియోలజీ, M.Com (FM / A&F) మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. సంబంధిత ఫలితాలు విడుదలయ్యాయి. www.results.manabadi.co.in ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News December 12, 2025
GNT: రేపు నవోదయలో ప్రవేశానికి ఎంట్రన్స్ పరీక్ష

దేశవ్యాప్తంగా నవోదయలో ఆరో తరగతి ప్రవేశానికి శనివారం పరీక్ష జరగనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా మద్దిరాలలో ఉన్న నవోదయ విద్యాలయ ప్రవేశానికి 5,420 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 12 బ్లాకులలోని 23 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అడ్మిట్ కార్డు పొందటంలో ఇబ్బందులున్నచో నవోదయ విద్యాలయ మద్దిరాల కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.


