News November 21, 2024

20 వేల ఎకరాల్లో ఎడారికన్నా దారుణమైన పరిస్థితులు: ఎమ్మెల్యే కాలవ

image

వెనుకబడిన ప్రాంతాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయదుర్గం అని ఎమ్మెల్యే శ్రీనివాసులు అసెంబ్లీలో పేర్కొన్నారు. జైసల్మేర్ ఎడారి అయిపోతుందని గగ్గోలు పెడుతున్నారని, కానీ నియోజకవర్గంలో 20వేల ఎకరాల్లో ఎడారికన్నా దారుణ పరిస్థితులున్నాయన్నారు. సినిమాల్లో ఎడారి దృశ్యాలను ఇక్కడ చిత్రీకరించుకుంటారన్నారు. అలాంటి ఎడారీకర నివారణ కోసం నిధులు కేటాయించాలని కోరగా, ‘ఎడారీకరణ మంచి పదం’ అని Dy స్పీకర్ కితాబిచ్చారు.

Similar News

News November 24, 2024

IPL వేలానికి మన కదిరి యువకుడు..!

image

ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరికి చెందిన క్రికెటర్ గిరినాథ్ రెడ్డి ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్నారు. రూ.30 లక్షల బెస్ ప్రైస్ తో అతడు తన పేరును వేలంలో రిజిస్టర్ చేసుకున్నారు. నేడు, రేపు దుబాయ్ వేదికగా ఐపీఎల్-2025 మెగా వేలం జరగనుంది. గిరినాథ్ రెడ్డిని ఏ జట్టు కొనుగోలు చేస్తుందో ఇవాళ లేదా రేపు తెలియనుంది.

News November 24, 2024

అనంతపురం జిల్లా విషాద ఘటనలో మృతులు వీరే!

image

అనంతపురం జిల్లా పుట్లూరు మండల పరిధిలోని <<14693066>>ఎల్లుట్ల <<>>గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిన్న గ్రామానికి చెందిన కూలీలు ఆటోలో వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు వీరే.. నాగన్న, నాగమ్మ (భార్యాభర్తలు), ఈశ్వరయ్య, కొండమ్మ (దంపతులు), రామాంజనమ్మ, బాలపెద్దయ్య, జయరాముడు, పెద్ద నాగమ్మ. ఒకే ప్రమాదంలో వీరంతా మృతి చెందడంతో గ్రామం కన్నీటి పర్యంతమవుతోంది.

News November 24, 2024

అనంతపురం: ఘోర రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి

image

గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను బస్సు ఢీకొన్న ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సాయంత్రం వరకు ఏడుగురు మరణించగా.. ప్రస్తుతం అనంతపురంలోని సవేరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరయ్య మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ ఈశ్వరయ్యకు మెరుగైన వైద్యసేవలు అందించినా.. దురదృష్టవశాత్తు అతను కూడా మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.