News April 6, 2024
20 సీట్లతో ఎలా సీఎం అయిపోతారు: ముద్రగడ

పవన్ 20 సీట్లతో ముఖ్యమంత్రి ఎలా అయిపోతారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. శనివారం తణుకులో వైసీపీ కాపు నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి వస్తే పథకాలన్నీ పక్కాగా అమలు చేస్తామని చెబుతున్న చంద్రబాబునాయుడు.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదా ..?అని అడిగారు.
Similar News
News November 27, 2025
కంబోడియా సూత్రధారి.. ప.గోలో 13 మంది అరెస్టు

భీమవరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శర్మ నుంచి రూ.78 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. కంబోడియాకు చెందిన ప్రధాన సూత్రధారి రహేత్ జె నయన్ సహకారంతో.. ‘కార్డ్ డీల్’ పద్ధతిలో ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 13 మందిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ నాగరాణి

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం పాలకోడేరు మండలం కుముదవల్లి రైతు సేవా కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తేమ శాతం లెక్కింపు, గోనె సంచుల పంపిణీ రిజిస్టర్లను పరిశీలించారు. రైతులు వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవాలని ఆమె సూచించారు. జేడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.