News October 29, 2024
20 సెకన్లపాటు గాల్లో వేలాడిన విశాఖ చిన్నారి
విజయవాడలోని ఓ హోటల్ పైనుంచి పడి సోమవారం ఉదయం విశాఖ చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. సీఐ ప్రకాశ్ వివరాల ప్రకారం.. బాలిక అన్నతో దాగుడుమూతలు ఆడుకుంటూ కిటికీ కర్టెన్ వెనుక దాక్కుంది. ప్రమాదవశాత్తు జారిపోయి, 20 సెకన్లు కిటికీని పట్టుకుని వేలాడింది. కింద ఉన్న యువకులు పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News November 8, 2024
అరకు: మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా బ్రోచర్ రిలీజ్ చేసిన హీరో
మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అల్లూరి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే ‘స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమ బ్రోచర్‌ను అరకులోయలో షూటింగ్‌కి వచ్చిన హీరో వెంకటేశ్ రిలీజ్ చేశారు. గంజాయి, సారా వంటి మాదకద్రవ్యాల నివారణకు, వాటితో కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసులు తీసుకుంటున్న చర్యలను హీరో వెంకటేశ్ ప్రశంసించారు. యువత మాదకద్రవ్యాల వైపు వెళ్లి భవిష్యత్తు పాడుచేసుకోవద్దని సూచించారు.
News November 8, 2024
ఏసీబీకి పట్టుబడిన తామరం వీఆర్వో
అనకాపల్లి జిల్లా మాకవరపాలెం తహశీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ తామరం వీఆర్వో లక్ష్మణరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. లక్ష్మణరావు తామరంతోపాటు భీమబోయినపాలెం, శెట్టిపాలెం రెవెన్యూ గ్రామాలకు వీఆర్వోగా పనిచేస్తున్నాడు. అయితే భీమబోయినపాలెం రెవెన్యూలో భూమి ఆన్‌లైన్ చేసేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటూ ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ అధికారులకు చిక్కాడు.
News November 8, 2024
నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలి: MLC
ఆంధ్రా యూనివర్సిటీ లైబ్రరీ రీడింగ్ రూమ్, ఈ లెర్నింగ్ సెంటర్ను శుక్రవారం ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు సందర్శించారు. గ్రూప్ 1&2, డీఎస్సీ,డిప్యూటీ ఈవో పోటీ పరీక్షల నిర్వహణ విషయమై అభ్యర్థులతో ఎమ్మెల్సీ ముఖాముఖి చర్చించి వారి అనుమానాలను నివృత్తి చేశారు. త్వరలో జరగబోయే ఈ పోటీ పరీక్షలకి ప్రణాళిక బద్ధంగా చదవాలని విద్యార్థులకు సూచించారు. త్వరలోనే నోటిఫికేషన్లు విడుదలవుతాయన్నారు.