News January 7, 2026

20 మందికి జైలు.. 86 మందికి జరిమానా: KMR ఎస్పీ

image

కామారెడ్డి జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 106 మందికి కోర్టు శిక్షలు విధించినట్లు జిల్లా SP రాజేశ్ చంద్ర బుధవారం తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన 20 మందికి ఒక రోజు జైలు శిక్షతో పాటు ఒక్కోరికి రూ.వెయ్యి జరిమానా విధించినట్లు చెప్పారు. మరో 86 మందికి మొత్తం రూ.87 వేల జరిమానా విధించారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లాలో నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని ఎస్పీ తెలిపారు.

Similar News

News January 11, 2026

పార్వతీపురం: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

భామిని మండలంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కొత్తూరు గ్రామానికి చెందిన శంకర్ బాలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నైట్ వాచ్‌మెన్‌‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీ నిమిత్తం శనివారం సాయంత్రం ఆసుపత్రికి బైక్‌పై బయలుదేరాడు. దారిలో ఎద్దుల బండిని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన శంకర్‌ని స్థానికులు అంబులెన్సులో ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు.

News January 11, 2026

మెదక్: GREAT.. 125 ఏళ్లు జీవించింది!

image

శివంపేట మండలం అల్లీపూర్‌కి చెందిన శతాధిక వృద్ధురాలు బైకాని లక్ష్మమ్మ (125) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 125 ఏళ్ల నిండు ఆయుష్షుతో జీవించిన ఆమె మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లి మరణంతో కుమారుడు శేఖరయ్య, కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. గ్రామస్థులు ఆమె మృతికి సంతాపం ప్రకటించారు.

News January 11, 2026

వచ్చే నెలే మున్సిపల్ పోరు.. పాలమూరు సిద్ధం

image

పాలమూరు గడ్డపై మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. పార్టీల వారీగా ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉమ్మడి జిల్లాలో వార్డుల వివరాలు ఇలా ఉన్నాయి. MBNR (కార్పొరేషన్) 60, భూత్పూర్ 10, దేవరకద్ర 12, NGKL 24, మక్తల్ 16, కోస్గి 16, మద్దూరు 16, WNP 33, కొత్తకోట 15, అమరచింత 10, ఆత్మకూర్ 10, పెబ్బేరు 12, కొల్లాపూర్ 19, కల్వకుర్తి 22, NRPT 24, గద్వాల్ 37, అలంపూర్ 10, అయిజ 20, వడ్డేపల్లి 10 ఉన్నాయి. SHARE IT